ఫారిన్‌లో పాట | Ram Charan goes romantic Song Shoot in New Zealand | Sakshi
Sakshi News home page

ఫారిన్‌లో పాట

Published Fri, Nov 11 2022 12:21 AM | Last Updated on Fri, Nov 11 2022 12:21 AM

Ram Charan goes romantic Song Shoot in New Zealand - Sakshi

త్వరలో న్యూజిల్యాండ్‌లో ల్యాండ్‌ కానున్నారు రామ్‌చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ న్యూజిల్యాండ్‌లో ఆరంభం కానుందని తెలిసింది. ఈ నెల మూడోవారంలో రామ్‌చరణ్, శంకర్‌ అండ్‌ టీమ్‌ ఫారిన్‌ ప్రయాణం  అవుతారు.

ముందుగా న్యూజిల్యాండ్‌లోని అందమైన లొకేషన్స్‌లో రామ్‌చరణ్, కియారాలపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తారట. ఈ పాటకు బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ బాస్కో మార్టిస్‌ స్టెప్స్‌ సమకూర్చనున్నారని తెలిసింది. ఈ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా ప్లాన్‌ చేశారట శంకర్‌. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement