
రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్‌సీ15'. ప్రస్తుతం ఈ సినిమాను న్యూజిలాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తున్నాయి. నటి కియారా అద్వానీ తన ఇన్‌స్టాలో పిక్స్ షేర్ చేయడంతో వైరలవుతున్నాయి.
(చదవండి: Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు)
షూటింగ్ గ్యాప్‌లో చరణ్‌తో కలిసి బర్గర్ తింటున్న ఫొటోలను కియారా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ రొమాంటిక్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. డ్యూన్‌డీన్‌సిటీ బీచ్‌తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లోని బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో చిత్రబృందంతో కలిసి సరదాగా గడుపుతున్న ఫొటోలను కియారా సోషల్ మీడియాలో పంచుకుంది.
కియారా తన ఇన్‌స్టాలో రాస్తూ..'తర్వాత సాంగ్ షూట్ కోసం డైట్‌లో ఉన్నామంటూ' రాసుకొచ్చింది. కియారా పోస్ట్‌కు ఫొటోలను ఉద్దేశించి రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కామెంట్ చేసింది. మీ అందరిని మిస్ అవుతున్నానంటూ రిప్లై ఇచ్చింది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. నవీన్‌చంద్ర, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment