Dilraju producer
-
దేవర విషయంలో అలా జరిగితేనే.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
-
దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి పెద్ద కర్మ (ఫోటోలు)
-
దిల్ మాంగే మోర్ అంటోన్న దిల్ రాజు..
-
రెమ్యూనరేషన్లో ఆల్ టైమ్ రికార్డ్.. వారీసుకు రూ.150 కోట్లు..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజాచిత్రం 'వారీసు'. తెలుగులో వారసుడు పేరుతో ఈనెల 14న రిలీజ్ కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా విజయ్‌కు జోడీగా నటించింది. సంక్రాంతి కానుకగా తమిళంలో ఈనెల 11న విడుదల కానుంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి విజయ్ తీసుకున్న పారితోషికంపై నెట్టింట చర్చ కొనసాగుతోంది. ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారీసు కోసం విజయ్ రూ.150 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా విజయ్ నిలవనున్నారు. దాదాపు ఇది బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్‌ను మించిపోయింది. అంతే కాకుండా కోలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. (ఇది చదవండి: సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం) విజయ్ సినిమాల ఎంపికలోనూ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్‌లతో సహా యువ దర్శకుతలతో జతకట్టాడు. విజయ్ పూర్తిగా స్క్రిప్ట్‌ల ఆధారంగా సినిమాలను నిర్ణయిస్తాడని.. కమర్షియల్‌తో పాటు ఎంటర్టైనర్కు సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా చూస్తానని నెల్సన్ అన్నారు. విజయ్‌కి ఓవర్సీస్లోనూ ప్రజాదరణ ఎక్కువగా ఉంది. అలాంటి ఆదరణ ఉన్న చాలా తక్కువ మంది దక్షిణాది నటుల్లో ఈయన ఒకరు. వారిసు సినిమా తమిళంలో జనవరి 11న, హిందీలో జనవరి 13న, తెలుగులో సంక్రాంతి స్పెషల్‌గా 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. -
న్యూజిలాండ్ షూట్లో బిజీగా రామ్‌చరణ్.. పిక్స్ వైరల్..!
రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్సీ15'. ప్రస్తుతం ఈ సినిమాను న్యూజిలాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తున్నాయి. నటి కియారా అద్వానీ తన ఇన్‌స్టాలో పిక్స్ షేర్ చేయడంతో వైరలవుతున్నాయి. (చదవండి: Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు) షూటింగ్ గ్యాప్‌లో చరణ్‌తో కలిసి బర్గర్ తింటున్న ఫొటోలను కియారా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ రొమాంటిక్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. డ్యూన్‌డీన్‌సిటీ బీచ్‌తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లోని బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో చిత్రబృందంతో కలిసి సరదాగా గడుపుతున్న ఫొటోలను కియారా సోషల్ మీడియాలో పంచుకుంది. కియారా తన ఇన్‌స్టాలో రాస్తూ..'తర్వాత సాంగ్ షూట్ కోసం డైట్లో ఉన్నామంటూ' రాసుకొచ్చింది. కియారా పోస్ట్‌కు ఫొటోలను ఉద్దేశించి రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కామెంట్ చేసింది. మీ అందరిని మిస్ అవుతున్నానంటూ రిప్లై ఇచ్చింది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. నవీన్‌చంద్ర, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
Vishwak Sen: 'ఓరి దేవుడా' బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని చిత్రబృందం అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రబృందం అక్టోబర్ 21 థియేటర్లలో కనువిందు చేయనున్నట్లు ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. Vishwak Sen: యాక్షన్ హీరో డైరెక్షన్లో విశ్వక్ సేన్ మూవీ.. ఆసక్తికర విషయాలు) పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా.. లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వేంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈ మూవీ నుంచి కేవలం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం తప్ప ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఒక్కసారిగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. -
‘పోలీసోడు’ టైటిల్ మార్చాల్సిందే
స్పష్టం చేస్తున్న పోలీసు అధికారుల సంఘం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన తాజా చిత్రం పోలీసోడు టైటిల్‌పై పోలీసు అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చిత్రానికి పెట్టిన పేరు పోలీసుల్ని అగౌరవపరిచేదిగా, వారి మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర విభాగం అధ్యక్షుడు ఎన్.శంకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది. ఈలోపు చిత్రం పేరు మార్చాల్సిందేనని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి బుధవారం రాత్రి దిల్‌రాజు ఇంటి వద్ద నోటీసులు ఇవ్వడానికి పోలీసు అధికారుల సంఘం సన్నాహాలు చేస్తోంది.