Ram Charan RC15 Shoot Starts In Pune - Sakshi
Sakshi News home page

RC15 : ఒక్క పాటకే 15 రోజుల పాటు షూటింగ్‌!

Published Sat, Oct 23 2021 9:23 AM | Last Updated on Sat, Oct 23 2021 10:01 AM

Ram Charan RC15 Shoot Starts In Pune - Sakshi

ర్రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ తాజాగా పుణేలో ప్రారంభమైందని తెలిసింది. ఈ చిత్రీకరణలో పాల్గొనడానికి ముంబయ్‌ వెళ్లి, అక్కణ్ణుంచి చరణ్‌ పూణె వెళ్లారని సమాచారం.

రామ్‌చరణ్‌–కియారా అద్వానీ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణను ప్లాన్‌ చేశారట. ఈ పాటను పది నుంచి 15 రోజుల పాటు చిత్రీకరించనున్నారని భోగట్టా. శంకర్‌ సినిమాల్లో పాటలు ఎంత రిచ్‌గా ఉంటాయో తెలిసిందే. ఈ పాట కోసం పుణేలో భారీ సెట్స్‌ తయారు చేయించారని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement