వైజాగ్‌కు మకాం మార్చారు రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియన్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ వైజాగ్ వెళ్లారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ అమృత్‌సర్‌లో జరిగింది. ఈ షెడ్యూల్‌లో కాలేజీ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. తదుపరి షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేశారు.
ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తో పాటు కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రామ్‌చరణ్ క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉంటాయని సమాచారం. కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారట. శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment