
అజిత్‌తో చేయాలని ఉంది
నిజమైన లక్ అంటే నటి ఎమిజాక్సన్‌దే.
నిజమైన లక్ అంటే నటి ఎమిజాక్సన్‌దే. ఎక్కడ కెనడా నుంచి వచ్చి కోలీవుడ్‌లో నటించడమే విశేషం అయితే ఇక్కడే ప్రముఖ హీరోయిన్లకు ధీటుగా వెలుగొందడం నిజంగా ఆశ్చర్యమే. ఇక రెండు మూడు చిత్రాల తరువాత స్టార్ దర్శకుడు శంకర్ చిత్రంలో నటించడం ఐదారు చిత్రాల తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకోవడం అంటే అదృష్టం ఎంతగా ఎమీని వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే ఈ ఇంగ్లిషు బ్యూటీ ఏమంత బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకోలేదు. తొలి చిత్రం మదరాసు పట్టణం తప్ప సరైన సక్సెస్‌లు వరించలేదు. అయినా స్టార్ హీరోయిన్‌గా నివసిస్తున్న ఎమిజాక్సన్‌తో చిన్న ఇంటర్వ్యూ..
ప్రశ్న: విదేశీ అమ్మాయి అయిన మీరు తమిళ భాషను ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు?
జవాబు: నిజం చెప్పాలంటే ఏ భాష అయినా నాకు కొత్తగానే ఉంటుంది. అయితే కష్టం మాత్రం కాదు. ఎందుకంటే దర్శకులు, నటులు, చాయాగ్రాహకులు అంటూ మొత్తం చిత్ర యూనిట్ ఆయా భాషలలో నాకు సహకరిస్తున్నారు. సంభాషణలు అర్థవంతంగా రాసుకుని చదువుకుంటున్నాను. ఆ విధంగా ఇప్పటికీ తమిళంలో ఆరు చిత్రాలు సమర్థవంతంగా నటించాను.
ప్రశ్న: ధనుష్‌తో తంగమగన్ చిత్రంలో నటించిన అనుభవం?
జవాబు: ధనుష్ నటనలో అనుభవశాలి. సెట్‌లో నాకు చాలానే సహకరించారు. సినిమాను ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయనతో కలసి పనిచేయడం సంతోషకరమైన విషయం. షూటింగ్ స్పాట్‌లో చాలా జాలీగా ఉంటారు.
ప్రశ్న: నటి సమంతతో కలిసి రెండు చిత్రాల్లో నటించడం గురించి?
జవాబు: సమంత నాకు నచ్చిన నటి. చాలా స్వీట్ ఫ్రెండ్. తంగమగన్ , తెర్రి చిత్రాలలో మేము కలిసి నటించాం. మంచి ప్రతిభ కలిగిన నటి సమంత. చిత్ర షూటింగ్‌లో సన్నివేశాల గురించి ఇద్దరం చర్చించుకునే వాళ్లం. హీరోయిన్లలో ఎవరితో నటించడం ఇష్టం అని అడిగితే నేను సమంత అనే చెబుతాను.
ప్రశ్న: మరి విక్రమ్, విజయ్, ధనుష్‌లతో ఇష్టం అయిన నటుడు?
జవాబు: ధనుష్
ప్రశ్న: ఏ హీరోతో నటించాలని ఆశపడుతున్నారు?
జవాబు: అజిత్‌తో
ప్రశ్న: సినిమా, వాణిజ్య ప్రకనట వీటిలో దేనికి ప్రాముఖ్యతనిస్తారు?
జవాబు: నా జీవితంలో వాణిజ్య ప్రకటనలో ఒక భాగం అనే చెప్పాలి. సినిమాలోకి వచ్చే ముందు మోడలింగ్‌లో బిజీగా ఉన్నాను. అయితే ప్రస్తుతం నా ప్రయారిటీ సినిమాకే. సినిమా చాలా నచ్చేసింది. ప్రస్తుతం సినిమాల పైనే దృష్టి సారిస్తున్నాను.
ప్రశ్న: చెన్నైలో నచ్చిన ప్రాంతాలు, ఆహారం?
జవాబు: చెన్నైలో కారు నడుపుకుంటూ పయనించడం ఇష్టం. మెరీనా బీచ్ చాలా నచ్చే ప్రాంతం. పాండిచ్చేరి కూడా నచ్చింది. ఈ రెండు ప్రాంతాలలోను మనసు ప్రశాంతంగా ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఆహారం విషయానికొస్తే అన్ని రకాల ఆహార పదార్థాలు తింటాను. తంగమగన్ చిత్ర షూటింగ్‌లో ధనుష్ నాకు ఇడ్లీ, దోసె తినడం అలవాటు చేశారు.
ప్రశ్న: తమిళ ప్రేక్షకుల గురించి మీ అభిప్రాయం?
జవాబు: ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం తమిళ సినీ ప్రేక్షకులే. మదరాసు పట్టణం, తాండవం, ఐ, తంగమగన్, గెత్తు, తెర్రి అంటూ తమిళ చిత్ర పరిశ్రమలో నా పయనం సాగిపోతోంది. నా ప్రేమ తమిళ ప్రేక్షకులపై ఎప్పుడూ ఉంటుంది.