
అమీని ఎట్రాక్ట్ చేసే ఆఫరే... నిజమయితే!? కానీ, అందులో నిజమెంత? అనేది క్వశ్చన్ మార్క్! ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ సిన్మాకి కథ ఓకే... క్యారెక్టరైజేషనూ (హీరోది) ఓకే... కెమెరాకు క్లాప్ బోర్డు కొట్టే అంశంలోనూ హీరో–దర్శకులు ఓ నిర్ణయానికి (త్వరలో పూజ చేసి, వచ్చే ఏడాది మార్చిలో సెట్స్‌కి వెళ్లాలనుకుంటున్నారట!) వచ్చేశారు. కానీ, ఇంకా కథానాయిక ఓకే కాలేదు.
ఆ ఛాన్స్ అమీ జాక్సన్‌కి వచ్చిందని ఫిల్మ్‌నగర్‌లో కొందరి గుసగుస. అసలు మేటర్ ఏంటంటే... ప్రస్తుతం పవన్‌కల్యాణ్ 25వ సినిమా షూటింగులో త్రివిక్రమ్ బిజీ. అందులో ఓ హీరోయిన్‌గా నటిస్తోన్న అనూ ఇమ్మాన్యుయేల్‌నే ఎన్టీఆర్ సినిమాకీ ఎంపిక చేశారట! సో, అమీ న్యూస్ ఉత్తిదేనట. అయినా... ఎన్టీఆర్ సిన్మా ఆర్టిస్టుల సెలక్షన్ గురించి పవన్ సినిమా పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ ఆలోచిస్తారని చిత్రనిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సన్నిహిత వర్గాల సమాచారం.