
దక్షిణాదిలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 2.0. ఈ సినిమాతో బాహుబలి రికార్డులు కూడా చెరిగిపోతాయని భావిస్తున్నారు. శంకర్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో రజనీ హీరోగా తెరకెక్కిన రోబో సీక్వల్ అని భావించారు. సినిమాలో రజనీ ఒక పాత్రలో రోబోగా కనిపించనుండటంతో రోబో సీక్వలే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.
అయితే తాజాగా సినిమా కథా కథనాల మీద క్లారిటీ ఇచ్చిన దర్శకుడు శంకర్. రోబో సినిమాకు 2.0 కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కేవలం రోబో సినిమాలోని కొన్ని పాత్రలను మాత్రమే ఈ సినిమా కంటిన్యూ చేశామని పూర్తిగా కొత్త కథా కథనాలతో 2.0ను తెరకెక్కించామని తెలిపారు. ప్రస్తుతం ఆఖరి పాట షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2018 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment