బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను | Amy jackson Reveals its Baby Boy | Sakshi
Sakshi News home page

ఇట్స్‌ ఏ బాయ్‌

Published Wed, Aug 28 2019 7:09 AM | Last Updated on Wed, Aug 28 2019 12:39 PM

Amy jackson Reveals its Baby Boy - Sakshi

అమీ జాక్సన్‌

హీరోయిన్‌ అమీ జాక్సన్‌ త్వరలో తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గర్భవతిగా తన ప్రయాణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు అమీ. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ వీడియోను పోస్ట్‌ చేశారామె. ‘‘బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను’’ అని ఓ పార్టీలో ఆనందంగా అనౌన్స్‌ చేశారు అమీ. యూకేకి చెందిన జార్జ్‌ పనయోట్టు అనే వ్యాపారవేత్తతో తాను డేటింగ్‌లో ఉన్నట్లు అమీ ఈ ఏడాది జనవరిలో వెల్లడించారు. మార్చిలో తాను గర్భవతినని అమీ పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో అమీ–జార్జ్‌ల నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెల అమీ డెలివరీ డేట్‌. బిడ్డ కడుపులో పడ్డాక నిశ్చితార్థం చేసుకున్న అమీ, జార్జ్‌ తల్లిదండ్రులయ్యాక పెళ్లి చేసుకుంటారు. వచ్చే ఏడాది గ్రీస్‌లో పెళ్లిని ప్లాన్‌ చేసినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ‘బీచ్‌ సైడ్‌ వెడ్డింగ్‌’ని ప్లాన్‌ చేశారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement