రీ రిలీజ్కు రెడీ అవుతున్న సూపర్ స్టార్ సినిమా
ప్రస్తుతం పరిస్థితుల్లో ఓ సినిమా 50 రోజుల పాటు థియేటర్లలో ఆడటమే కష్టం అలాంటిది ఓ సినిమా రిలీజ్ చేయటం అంటే సాహసం అనే చెప్సాలి. కానీ కొంత మంది హీరోల ఇమేజ్ దృష్ట్యా.., రీ రిలీజ్లు కూడా వర్క్ అవుట్ అవుతాయని నమ్ముతున్నారు ఫిలిం మేకర్స్. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బాక్ల్ బస్టర్ సినిమా భాషాను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
1995 జనవరి 15న రిలీజ్ అయిన భాషా సినిమా సూపర్ స్టార్ ఇమేజ్ను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. అయితే ఈ సినిమాకు ఇప్పటికే సాంకేతికతో మరింత మెరుగులు దిద్ది.., డిజిటలైజ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 12న రజనీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో శివాజీ సినిమా 3డి వర్షన్ ను రీ రిలీజ్ చేయగా అభిమానులు పెద్దగా ఆదరించలేదు. మరి భాషా విషయంలో సూపర్ స్టార్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.