Baasha
-
రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సూపర్ స్టార్ సినిమా
ప్రస్తుతం పరిస్థితుల్లో ఓ సినిమా 50 రోజుల పాటు థియేటర్లలో ఆడటమే కష్టం అలాంటిది ఓ సినిమా రిలీజ్ చేయటం అంటే సాహసం అనే చెప్సాలి. కానీ కొంత మంది హీరోల ఇమేజ్ దృష్ట్యా.., రీ రిలీజ్లు కూడా వర్క్ అవుట్ అవుతాయని నమ్ముతున్నారు ఫిలిం మేకర్స్. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బాక్ల్ బస్టర్ సినిమా భాషాను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 1995 జనవరి 15న రిలీజ్ అయిన భాషా సినిమా సూపర్ స్టార్ ఇమేజ్ను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. అయితే ఈ సినిమాకు ఇప్పటికే సాంకేతికతో మరింత మెరుగులు దిద్ది.., డిజిటలైజ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 12న రజనీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో శివాజీ సినిమా 3డి వర్షన్ ను రీ రిలీజ్ చేయగా అభిమానులు పెద్దగా ఆదరించలేదు. మరి భాషా విషయంలో సూపర్ స్టార్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
బాషాకు సీక్వెల్ తీస్తే..?
బాషా ఈ పేరు వినగానే మదిలో మెదిలేది సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆ చిత్రంలో రెండు డైమన్స్లో సాగే పాత్రకు రజనీకాంత్ అద్భుతంగా ప్రాణం పోశారు. అప్పటి అందాలతార నగ్మా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం విజయం ఖండాంతరాలు దాటింది. సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో బాషా-2 రూపొందిస్తే విజయం సాధిస్తుందా? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నది ఎవరో కాదు ఆ చిత్ర హీరో రజనీకాంత్‌నే. ఈ విషయాన్ని స్వయాన దర్శకుడు సురేష్‌కృష్ణ వెల్లడించారు. బాషా చిత్రానికి సృష్టికర్త ఈయన అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజనీకాంత్, సురేష్‌కృష్ణల సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం బాషా. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించడానికి దర్శకుడు సురేష్‌కృష్ణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ రజనీకాంత్‌తో బాషా-2 చిత్రాన్ని తెరకెక్కించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై రజనీతో పలు సార్లు చర్చించానన్నారు. అయితే బాషా చిత్రం స్థాయి లో దానికి సీక్వెల్ విజయం సాధిస్తుందా? అన్న సందేహం ఆయనకుందన్నారు. తనకు మాత్రం బాషా -2 చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్ర రూపకల్పన విషయంలో తన ప్రయత్నం కొనసాగుతోందని సురేష్‌కృష్ణ వెల్లడించారు. రజనీ బాషా-2లో నటించాలని తానెంతగా కోరుకుంటున్నానో అంతకంటే అధికంగా ఆయన అభిమానులు ఆశిస్తున్నారని చెప్పారు. -
దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మాజీ మిస్ ఇండియా!
దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మిస్ ఇండియా పరిచయం కాబోతున్నది. తమిళంలో సత్య, భాషా, అన్నామలై, తెలుగులో ప్రేమ, మాస్టర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సురేశ్ కృష్ణ మాజీ మిస్ ఇండియా వన్య మిశ్రాను దక్షిణాది పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. మా ప్రాజెక్ట్ కోసం వన్య మిశ్రాను ఎంపిక చేశాం. ఇటీవల ఫోటో షూట్ జరిగింది. తాను స్వంత బ్యానర్ లో నిర్మించే చిత్రంలోని పాత్రకు ఖచ్చితంగా సరిపోయే ఎనర్జీ, టాలెంట్ వన్యలో ఉన్నాయని సురేశ్ కృష్ణ తెలిపారు. ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ చిత్రంలో ప్రిన్స్ సెసిల్ కథానాయకుడిగా కనిపించనున్నారు.