బాషాకు సీక్వెల్ తీస్తే..? | Sequel to Rajinikanths Baasha,says Suresh Krissna | Sakshi
Sakshi News home page

బాషాకు సీక్వెల్ తీస్తే..?

Published Thu, Jan 2 2014 9:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

బాషాకు సీక్వెల్ తీస్తే..?

బాషాకు సీక్వెల్ తీస్తే..?

బాషా ఈ పేరు వినగానే మదిలో మెదిలేది సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆ చిత్రంలో రెండు డైమన్స్‌లో సాగే పాత్రకు రజనీకాంత్ అద్భుతంగా ప్రాణం పోశారు. అప్పటి అందాలతార నగ్మా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం విజయం ఖండాంతరాలు దాటింది. సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో బాషా-2 రూపొందిస్తే విజయం సాధిస్తుందా? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నది ఎవరో కాదు ఆ చిత్ర హీరో రజనీకాంత్‌నే.
 
 ఈ విషయాన్ని స్వయాన దర్శకుడు సురేష్‌కృష్ణ వెల్లడించారు. బాషా చిత్రానికి సృష్టికర్త ఈయన అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజనీకాంత్, సురేష్‌కృష్ణల సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం బాషా. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించడానికి దర్శకుడు సురేష్‌కృష్ణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ రజనీకాంత్‌తో బాషా-2 చిత్రాన్ని తెరకెక్కించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై రజనీతో పలు సార్లు చర్చించానన్నారు.
 
 అయితే బాషా చిత్రం స్థాయి లో దానికి సీక్వెల్ విజయం సాధిస్తుందా? అన్న సందేహం ఆయనకుందన్నారు. తనకు మాత్రం బాషా -2 చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్ర రూపకల్పన విషయంలో తన ప్రయత్నం కొనసాగుతోందని సురేష్‌కృష్ణ వెల్లడించారు. రజనీ బాషా-2లో నటించాలని తానెంతగా కోరుకుంటున్నానో అంతకంటే అధికంగా ఆయన అభిమానులు ఆశిస్తున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement