'ఆ హీరోతో బాషా-2 తీయడం లేదు' | Not directing 'Baasha 2' with Ajith: Suresh Krissna | Sakshi
Sakshi News home page

'ఆ హీరోతో బాషా-2 తీయడం లేదు'

Published Wed, Jul 22 2015 3:11 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

'ఆ హీరోతో బాషా-2 తీయడం లేదు'

'ఆ హీరోతో బాషా-2 తీయడం లేదు'

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం బాషాకు సీక్వెల్గా బాషా-2ను హీరో అజిత్ కుమార్తో తీయనున్నట్టు వచ్చిన వార్తలను దర్శకుడు సురేష్ కృష్ణ తోసిపుచ్చారు. అజిత్తో తాను బాషా-2 తీయడం లేదని స్పష్టం చేశారు.

'బాషా సినిమా గురించి రూమర్లు విని సంతోషించా. ఇవి నిజం కావాలని కోరుకుంటున్నా. అయితే అజిత్ హీరోగా బాషా-2 సినిమాకు నేను దర్శకత్వం వహించడం లేదు. అజిత్తో సినిమా చేయడం ఇష్టమేకాని ప్రస్తుతం సీక్వెల్ ప్రస్తావన రాలేదు' అని సురేష్ కృష్ణ చెప్పారు. 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన బాషా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని నిర్మించిన సత్య జ్యోతి మూవీస్ కొత్త ప్రాజెక్టు కోసం అజిత్ కుమార్ సంతకం చేశారు. దీంతో బాషా-2 తీయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సురేష్ కృష్ణ స్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement