Suresh Krissna
-
'ఆ హీరోతో బాషా-2 తీయడం లేదు'
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం బాషాకు సీక్వెల్‌గా బాషా-2ను హీరో అజిత్ కుమార్‌తో తీయనున్నట్టు వచ్చిన వార్తలను దర్శకుడు సురేష్ కృష్ణ తోసిపుచ్చారు. అజిత్‌తో తాను బాషా-2 తీయడం లేదని స్పష్టం చేశారు. 'బాషా సినిమా గురించి రూమర్లు విని సంతోషించా. ఇవి నిజం కావాలని కోరుకుంటున్నా. అయితే అజిత్ హీరోగా బాషా-2 సినిమాకు నేను దర్శకత్వం వహించడం లేదు. అజిత్‌తో సినిమా చేయడం ఇష్టమేకాని ప్రస్తుతం సీక్వెల్ ప్రస్తావన రాలేదు' అని సురేష్ కృష్ణ చెప్పారు. 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన బాషా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని నిర్మించిన సత్య జ్యోతి మూవీస్ కొత్త ప్రాజెక్టు కోసం అజిత్ కుమార్ సంతకం చేశారు. దీంతో బాషా-2 తీయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సురేష్ కృష్ణ స్పందించారు. -
బాషాకు సీక్వెల్ తీస్తే..?
బాషా ఈ పేరు వినగానే మదిలో మెదిలేది సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆ చిత్రంలో రెండు డైమన్స్లో సాగే పాత్రకు రజనీకాంత్ అద్భుతంగా ప్రాణం పోశారు. అప్పటి అందాలతార నగ్మా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం విజయం ఖండాంతరాలు దాటింది. సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో బాషా-2 రూపొందిస్తే విజయం సాధిస్తుందా? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నది ఎవరో కాదు ఆ చిత్ర హీరో రజనీకాంత్‌నే. ఈ విషయాన్ని స్వయాన దర్శకుడు సురేష్‌కృష్ణ వెల్లడించారు. బాషా చిత్రానికి సృష్టికర్త ఈయన అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజనీకాంత్, సురేష్‌కృష్ణల సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం బాషా. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించడానికి దర్శకుడు సురేష్‌కృష్ణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ రజనీకాంత్‌తో బాషా-2 చిత్రాన్ని తెరకెక్కించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై రజనీతో పలు సార్లు చర్చించానన్నారు. అయితే బాషా చిత్రం స్థాయి లో దానికి సీక్వెల్ విజయం సాధిస్తుందా? అన్న సందేహం ఆయనకుందన్నారు. తనకు మాత్రం బాషా -2 చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్ర రూపకల్పన విషయంలో తన ప్రయత్నం కొనసాగుతోందని సురేష్‌కృష్ణ వెల్లడించారు. రజనీ బాషా-2లో నటించాలని తానెంతగా కోరుకుంటున్నానో అంతకంటే అధికంగా ఆయన అభిమానులు ఆశిస్తున్నారని చెప్పారు. -
దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మాజీ మిస్ ఇండియా!
దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరో మిస్ ఇండియా పరిచయం కాబోతున్నది. తమిళంలో సత్య, భాషా, అన్నామలై, తెలుగులో ప్రేమ, మాస్టర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సురేశ్ కృష్ణ మాజీ మిస్ ఇండియా వన్య మిశ్రాను దక్షిణాది పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. మా ప్రాజెక్ట్ కోసం వన్య మిశ్రాను ఎంపిక చేశాం. ఇటీవల ఫోటో షూట్ జరిగింది. తాను స్వంత బ్యానర్ లో నిర్మించే చిత్రంలోని పాత్రకు ఖచ్చితంగా సరిపోయే ఎనర్జీ, టాలెంట్ వన్యలో ఉన్నాయని సురేశ్ కృష్ణ తెలిపారు. ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ చిత్రంలో ప్రిన్స్ సెసిల్ కథానాయకుడిగా కనిపించనున్నారు.