
రజనీ, సమంతల తరువాత త్రిష ఖాతానే..
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణణ్ మరో రికార్డ్ను సాధించింది. ఇటీవల మరో సార్ట్ హీరోయిన్ సమంత ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 30 లక్షల మందికి చేరుకోగా తాజాగా త్రిష కూడా ఆ ఘనత సాధించింది. పెళ్లి క్యాన్సిల్ అవ్వటం, తరువాత వరుస ఫ్లాప్లతో ఇటీవల కెరీర్ పరంగా కాస్త ఇబ్బందుల్లో పడ్డ త్రిష, తాజాగా ధనుష్ సరసన హీరోయిన్గా నటించిన కోడి సక్సెస్తో తిరిగి ఫాంలోకి వచ్చింది.
ప్రసత్తుం గ్లామర్ రోల్స్తో పాటు లేడి ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్న త్రిష సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటోంది. ప్రస్తుతం దక్షిణాదిలో 30 లక్షల మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్న నటులు ముగ్గురే కావటం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్, సమంతల తరువాత ఈ ఘనత సాధించిన నటి త్రిష మాత్రమే. ఇంతటి అరుదైన ఘనతను తనకు అందించిన అభిమానులకు త్రిష తన కృతజ్ఞతలు తెలిపింది.
Kisses for my 3M Thx for all d wishes,consistent support n love always pic.twitter.com/8SpkopzoCt
— Trisha Krishnan (@trishtrashers) 18 November 2016