రజనీ 2.0 ఫస్ట్ లుక్ ఇదే
ముంబై: రజనీకాంత్, శంకర్ల కాంబినేషన్లోని భారీ చిత్రం 2.0 ఫస్ట్ లుక్ విడుదలైంది. కబాలి విజయంతో మంచి ఫాంలో ఉన్న రజనీ హీరోగా, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున‍్నాయి. అందుకు తగ్గట్లే.. రజనీ, అక్షయ్ కుమార్ నువ్వానేనా అన్నట్లు ఎదురెదురుగా కనబడుతున్న ఫస్ట్‌లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆదివారం ముంబైలోని యష్ రాజ్ ఫిలిం స్టూడియోలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ లాంచ్ చేసింది.
కాగా.. అక్షయ్ కుమార్ తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. దీనిలో అక్షయ్ భారీ గోళ్లతో భయంకరంగా కనిపిస్తూ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం రజనీ, అక్షయ్ కుమార్‌ల ఫస్ట్‌లుక్ పోస్టర్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో రజనీ సరసన అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. రోబో చిత్రానికి సీక్వల్గా రూపొందుతున్న ఈ సినిమాను 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు.