
ఎస్టర్‌డే.. రజనీ సర్ బర్త్‌డే
ఈ ముక్కేదో నిన్ననే కట్ చేయలి కదా!
కట్ చేయడానికిది కేక్ కాదు బాబూ... షేక్!
నిన్నంతా సోషల్ మీడియా రజనీ దెబ్బకి షేక్ అయింది!
రజనీ సర్.. యువార్ ది స్టార్.
రజనీ సర్.. యువార్ ది వార్.
రజనీ సర్.. యువార్ ది జార్.
రజనీ సర్.. సరిలేరు నీకెవ్వర్.
ఇదీ.. వైబ్రేషన్.. సెలబ్రేషన్!
రజనీ సర్ ఎంత గ్రేటో అభిమానులు చెబితే వినాల్సిందే. విని తీరాల్సిందే. విన్నాక చెప్పండి. రజనీ సర్ గ్రేటా? కాదా అన్నది తేల్చి చెప్పండి.
⇔ రజనీ సర్ టైమ్ చూసుకోరు. టైమ్ ఎంత అవ్వాలో ఆయనే డిసైడ్ చేస్తారు!
⇔ రజనీ సర్ వైర్‌లెస్ ఫోన్‌తో కూడా గొంతు బిగించి చంపేయగలరు!
⇔ రజనీ సర్ క్యాలెండర్‌లో మార్చి 31 తర్వాత ఏప్రిల్ 2 ఉంటుంది. (రజనీ సర్‌ని ఎవరూ ఫూల్‌ని చెయ్యలేరు).
⇔ ఆపిల్ కంపెనీ లోగోలోని ఆపిల్‌ని కొరికి వదిలిపెట్టింది రజనీయే!
⇔ హాలీవుడ్ మూవీ ‘మిషన్: ఇంపాజిబుల్’ లీడ్ రోల్ రజనీదే. రజనీ సర్‌కి ఆ టైటిల్ అవమానకరంగా ఉండడంతో ఆయన ప్లేస్‌లోకి టామ్ క్రూజ్‌ని తీసుకున్నారు!
⇔ శాంటాక్లాస్ ప్రతి సంవత్సరం రజనీ సర్ దగ్గరికి గిఫ్ట్ కోసం వస్తాడు!
⇔ గజనీ కూడా రజనీని మర్చిపోలేడు.
⇔ ఫేస్‌బుక్ రిక్వెస్ట్ పంపితేనేగానీ రజనీ సర్ ఫేస్‌బుక్‌ని తన ఫ్రెండుగా యాడ్ చేసుకోలేదు!
⇔ రజనీ సర్ మెయిల్ ఐడి outlook@rajnikanth.com
⇔ ఓ వన్‌డే మ్యాచ్‌లో రజనీ సర్ 15 వికెట్లు తీసుకున్నారు!
⇔ ఓసారి రజనీ సర్ ‘కౌన్‌బనేగా...’ హాట్ సీట్‌లో కూర్చున్నప్పుడు సర్‌ని క్వొశ్చన్ అడగడానికి కంప్యూటర్ గారు.. హెల్ప్‌లైన్ తీసుకోవలసి వచ్చింది!
⇔ 150 ప్రశ్నలిచ్చి వాటిల్లో 100 ప్రశ్నలకు సమాధానం రాయమని అడిగితే రజనీ సర్ 150 ప్రశ్నలకూ ఆన్సర్లు రాసి, మీకు ఇష్టమైన 100 ఆన్సర్‌లను చెక్ చేసుకోమని ఆన్షర్ షీట్‌పై నోట్ పెట్టి వచ్చేశారు!
⇔ రజనీ సర్ ట్వీట్ చెయ్యరు. హి ఓన్లీ రోర్స్.
⇔ అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలీఫోన్ కనుక్కోగానే రెండు మిస్డ్ కాల్స్ కనిపించాయి. అవి రెండూ రజనీ సర్‌వే!
⇔ రజనీ సర్ మాత్రమే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్కించగలరు!
⇔ ఓసారి ఓ రైతు తన పంట పొలంలో రజనీ సర్ కటౌట్ పెట్టారు. అప్పుడేం జరిగిందో ఊహించండి. దోచుకెళ్లిన ధాన్యం గింజల్ని కూడా పిట్టలు వెనక్కి తెచ్చి పడేశాయి!
⇔ రజనీ సర్ ఆరో తరగతి నోట్సే ఇప్పుడు మనం చూస్తున్న వికీపీడియా!
⇔ సూపర్‌మేన్, బాట్స్‌మేన్ రజనీ సర్ దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆ రోజు టీచర్స్ డే.
⇔ ఓసారి రజనీ సర్ మెరుపుతో పోటీ పడ్డారు. అప్పుడు మెరుపు థర్డ్ వచ్చింది. రజనీ నీడ సెకండ్ వచ్చింది!