రజనీ కూడా వెనకడుగేశాడు..! | Rajini Kanth, Shankar 2.0 release postponed | Sakshi
Sakshi News home page

రజనీ కూడా వెనకడుగేశాడు..!

Published Sat, Apr 22 2017 11:21 AM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

రజనీ కూడా వెనకడుగేశాడు..!

రజనీ కూడా వెనకడుగేశాడు..!

ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో వాయిదా పర్వం నడుస్తోంది. స్టార్ హీరోలందరూ తమ సినిమాలను వరుసగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్యువల్ సినిమాగా తెరకెక్కుతున్న స్పైడర్ రిలీజ్ వాయిదా పడింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాను కూడా వాయిదా వేశారు.

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. రోబో సినిమాకు సీక్వల్ శంకర్, రజనీకాంత్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.0 కూడా వాయిదా పడింది. గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమవుతుండటంతో మరింత నాణ్యమైన అవుట్ పుట్ కోసమే సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర నిర్మాతలు పలికారు. ముందుగా ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని భావించినా.. ఇప్పుడు మరో నాలుగు నెలలు ఆలస్యంగా 2018 జనవరి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement