
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క తమిళనాడులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. తలైవా అంటూ ప్రేమగా పిలుచుకుంటారు ఆయన అభిమానులు. రీసెంట్‌గా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేశాడు. ఈ సినిమా షూటింగ్ ముగియడంతో.. రిలాక్స్ కోసం రజనీ హిమాలయ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి శుక్రవారం అర్ధరాత్రి చైన్నైకు చేరుకున్నారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అంతేకాదు ఆయనతో సెల్పీలు దిగడం కోసం ఎగబడ్డారు. అక్కడున్న వారందరికీ రజినీకాంత్ కూల్‌గా సమాధాన మిచ్చి తన కారులో ఇంటికి బయలు దేరారు.
ఇంతలో ఓ అభిమాని బైక్ పై రజనీ కారును ఫాలో అయ్యాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రజనీకాంత్.. ఇంటికి చేరగానే ఆ సెక్యూరిటీ ద్వారా అభిమానిని లోపలికి పిలిపించుకుని ట్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంత రాత్రివేళ బైక్ పై ప్రయాణించడం మంచిది కాదని మందలించాడు. మరోసారి ఇలా ఫాలో కావొద్దని చెప్పడమే కాకుండా ఆ అభిమానితో ఓ ఫొటో కూడా దిగారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఆ అభిమానే స్వయంగా వెల్లడించాడు.
Here's the video.... Thalaivaaaaaaaa🔥🔥🔥🔥❤️❤️#WelcomeBackThalaiva pic.twitter.com/qwRoKZsg5G
— Viswa (@itsViswaa) October 18, 2019