Himalayas tour
-
హిమాలయాల్లో రజినీకాంత్..
-
అభిమానిని మందలించిన రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క తమిళనాడులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. తలైవా అంటూ ప్రేమగా పిలుచుకుంటారు ఆయన అభిమానులు. రీసెంట్గా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేశాడు. ఈ సినిమా షూటింగ్ ముగియడంతో.. రిలాక్స్ కోసం రజనీ హిమాలయ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి శుక్రవారం అర్ధరాత్రి చైన్నైకు చేరుకున్నారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అంతేకాదు ఆయనతో సెల్పీలు దిగడం కోసం ఎగబడ్డారు. అక్కడున్న వారందరికీ రజినీకాంత్ కూల్‌గా సమాధాన మిచ్చి తన కారులో ఇంటికి బయలు దేరారు. ఇంతలో ఓ అభిమాని బైక్ పై రజనీ కారును ఫాలో అయ్యాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రజనీకాంత్.. ఇంటికి చేరగానే ఆ సెక్యూరిటీ ద్వారా అభిమానిని లోపలికి పిలిపించుకుని ట్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంత రాత్రివేళ బైక్ పై ప్రయాణించడం మంచిది కాదని మందలించాడు. మరోసారి ఇలా ఫాలో కావొద్దని చెప్పడమే కాకుండా ఆ అభిమానితో ఓ ఫొటో కూడా దిగారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఆ అభిమానే స్వయంగా వెల్లడించాడు. Here's the video.... Thalaivaaaaaaaa🔥🔥🔥🔥❤️❤️#WelcomeBackThalaiva pic.twitter.com/qwRoKZsg5G — Viswa (@itsViswaa) October 18, 2019 -
మళ్లీ హిమాలయాలకు రజనీ
చెన్నై,పెరంబూరు: నటుడు రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాట పట్టారు. ఆయన రాజకీయ రంగప్రవేశంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ ఈ ఐదక్షరాల పేరు సినీ, రాజకీయ వర్గాల్లో జపమంత్రంగా మారింది. రజనీ సినిమాలను వదలరా? అన్న చర్చ ఒకటైతే, ఆయన రాజకీయాల్లోకి వస్తారా?అన్న ప్రశ్న మరొకటి. గత 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో వస్తానంటూ అభిమానులను ఊరిస్తూ వస్తున్న రజనీ.. ఎట్టకేలకు ఇటీవల రాజకీయరంగ ప్రవేశం త్వరలో ఉంటుందని గత ఏడాది డిసెంబరులో బహిరంగంగా వెల్ల డించారు. అదీ జయలలిత మరణంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఏర్పడిందని, దాన్ని తాను భర్తీ చేస్తానని కాస్త గట్టిగానే చెప్పారు. తాను ఎంజీఆర్ తరహా పాలను తీసుకొస్తానని, ఆయన అభిమానుల్ని అకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సారి రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం ఖాయం అనుకున్న కొందరు రాజకీయ నాయకులు ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక ఆయన అభిమానుల్లో కొందరు రజనీకాంత్ సినిమాలకు దూరం అవుతారనే బాధను వ్యక్తం చేశారు. మెజారిటీ అభిమానులు రజనీకాంత్ రాజకీయ ప్రకటనలో సంబరాలు చేసుకున్నారు. ఆయన్ని నమ్ముకున్న రాజకీయవాదులు, అభిమానులు ఇప్పుడు అయోమయంలో పడే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నది వాస్తవం. కారణం రజనీ రాజకీయరంగ ప్రవేశం ప్రకటన చేసి సుమారు రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటి వరకూ ఆయన నుంచి ఆ దిశగా ఒక స్థిరమైన నిర్ణయం రాలేదు. రజనీ ప్రజా సంఘాలు, నిర్వాహకుల నియమితం వంటి కార్యక్రమాలతో అభిమానులను ములగ చెట్టు ఎక్కించినంత పని చేసి.. తరువాత సైలెంట్ అయ్యిపోయారు. తను మాత్రం వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. సక్సెస్‌లే కారణమా? రజనీకాంత్ ఇటీవల నటించిన కబాలి, పేట వంటి చిత్రాల విజయాలు ఆయనలో నూతనోత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. ఇక 2.ఓ చిత్రం ఆశించిన రీతిలో విజయాన్ని అందుకోలేకపోయినా, సాంకేతిక పరంగా అదో బ్రాహ్మాండ చిత్రంగా నిలిచింది. రజనీకాంత్‌కు నటనకు దూరం కావడం ఇష్టం లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేద్దామని భిమానులతో గట్టిగా చెప్పిన రజనీకాంత్ ఇప్పటి వరకూ ఆ దిశగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. పైగా చిత్రాలను వదులుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో దర్భార్ చిత్రంలో నటించి పూర్తి చేశారు. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రం 2020లో సంక్రాంతికి తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీసు అధికారిగా నటించారు. అవినీతి, అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నం లాంటి పాత్రలో రజనీకాంత్ నటించారని, త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న ఆయన రాజకీయ జీవితానికి దర్భార్ గట్టి పునాదిగా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం తరువాత రజనీ రాజకీయాలపై దృష్టి సారిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన సైలెంట్‌గా మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు. హిమాలయాల బాట రజనీ నటిస్తున్న చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన తరువాత హిమాలయాలకు వెళ్లడం రజనీకాంత్‌కు ఆనవాయితీగా మారింది. హిమాలయాల్లో కనీసం 10 రోజులకు తగ్గకుండా ఆయన గడిపి తిరిగొస్తారు. తరువాత కొత్త చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే ఆనవాయితీని తాజాగా మరోసారి కొనసాగించారు. అవును దర్భార్ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో రజనీకాంత్ ఆదివారం ఉదయం చెన్నై విమానాశ్రయం నుంచి హిమాలయాలకు బయలు దేరారు. ఆయన విమానం ద్వారా ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు చేరుకుని, అక్కడ నుంచి కారులో పయనించి పలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారని తెలిసింది. కేధార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్య స్టలాలను దర్శించుకుంటారు. అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లాతారని సమాచారం. హిమాలయాల్లో ఆయన దైవంగా భావించే బాబా గృహలో ధ్యానం చేసి, ఆక్కడ పలు ప్రాంతాలను సందర్శించి చెన్నైకి తిరిగొస్తారు. తరువాత దర్భార్ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్ర షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం మరింత జాప్యం జరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరో విషయం ఏమిటంటే రజనీకాంత్‌కు అత్యంత సన్నిహితుడు, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావద్దంటూ హితవు పలికారు. తాను తెలుగు నటుడు చిరంజీవికి ఇదే సూచన చేశానని, ఇప్పుడు రజనీకి కూడా ఇదే చెబుతున్నానని అన్నారు. మరో పక్క బీజేపీ రజనీకాంత్‌ను తమ పార్టీలోకి లాగడానికి గాలం వేస్తోంది. ఇవన్నీ రజనీకాంత్‌పై ముప్పేట దాడి చేసి ఎటూ తేల్చుకోలేని పరిస్థితికి నెట్టేసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా రజనీ రాజకీయం పెద్ద చర్చనీయాంశంగా మారిందన్న నిజం. -
హిమాలయాలకు రజనీకాంత్
సాక్షి, చెన్నై: సినీ నటుడు రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాటపట్టారు. శనివారం చెన్నై నుంచి విమానంలో సిమ్లాకు బయలుదేరారు. ఆధ్యాత్మిక పర్యటనకు రజనీకాంత్ శ్రీకారం చుట్టడంతో తమిళ సంవత్సరాదిన కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. తాను ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా హిమాలయాలకు వెళ్లి బాబా ఆశీస్సులు పొందే రజనీ ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో హిమాలయ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. పర్యటనలో భాగంగా సిమ్లాకు, తర్వాత ధర్మశాల, రిషికేశ్‌లకు వెళ్లనున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటులో భాగంగా బాబా ఆశీస్సుల కోసం వెళ్తున్నారా అని చెన్నైలో మీడియా ప్రశ్నించగా, ‘ఇప్పుడెందుకు ఆ ప్రశ్న’ అని దాట వేశారు. -
ఆ రూమర్ నన్ను ఇబ్బంది పెట్టింది : విశాల్
వాణిజ్య చిత్రాలతో పాటు ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే విశాల్ ఇటీవలే ‘ఇంద్రుడు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. హైదరాబాద్ వచ్చిన విశాల్‌తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. ఉన్నట్లుండి ఇలా ప్రయోగాల బాట పట్టారేం? ఇప్పుడు చేయపోతే... ఇంకెప్పుడు చేయలేం. అసలు ఇలాంటి పాత్రలు చేసే సామర్థ్యం నాకుందా? అనే మీమాంసలో ఉండేవాణ్ణి మొదట్లో. ‘వాడు-వీడు’ చిత్రంతో ప్రయోగాలు చేయొచ్చని అర్థమైంది. ఏళ్ల తరబడి ప్రేక్షకుల హృదయాల్లో ఉండాలంటే ఇలాంటి పాత్రలే కరెక్ట్. వాణిజ్యపరంగా చూసుకుంటే ఇది రిస్కే. అందుకని రొటీన్‌గా వెళ్లమంటే నా వల్ల కాదు. ‘ఇంద్రుడు’లో నార్కొలస్పీ డిజార్డర్‌తో బాధపడే పాత్ర చేశారు కదా. దీనికోసం ఏమైనా హోమ్‌వర్క్ చేశారా? సాధారణంగా పోరాటాలు, నృత్యాల సమయంలో కష్టం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ పడిపోయే సన్నివేశాలే కష్టంగా అనిపించాయి. నిల్చున్నవాణ్ణి నిల్చున్నట్లే పడిపోవాలి. చేతుల్ని నేలకు బేలన్స్ చేయకూడదు. దాంతో భారీగా దెబ్బలు తగిలేవి. వాటన్నింటినీ భరిస్తూ చేశాను. హీరో అంటే.. ‘విలన్లను ఒంటిచేత్తో కొట్టేయాలి’ అనేది చాలామంది అభిప్రాయం. కానీ... ఇందులో కంటి ముందు హీరోయిన్ని కొట్టి చంపుతుంటే.. నిద్రపోతాను. ఈ కథ విని కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. కానీ నాకు మాత్రం ఈ కథ బాగా నచ్చింది. మీరు తెలుగబ్బాయి. కానీ... తమిళ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కారణం? నేను పుట్టింది, పెరిగిందీ చెన్నయ్‌లో. సహాయ దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టిందీ అక్కడే. అందుకే.. ఆ పరిశ్రమపై మక్కువ ఎక్కువ. ఒకవేళ ఇక్కడే పుడితే ఇలా జరిగేది కాదేమో. నేను తెలుగువాణ్ణి కాబట్టే.. మాతృభాషలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మా నాన్నగారు తపించారు. అందుకే ఇక్కడా విజయాలు అందుకోగలిగా. త్వరలో తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాను. అందులోనూ నా పాత్ర భిన్నంగానే ఉంటుంది. శ్రీనువైట్ల సహాయకుడు శశికాంత్‌ని ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాను. ‘శివ’ను గుర్తుచేసేలా ఉంటుందీ సినిమా. అక్టోబర్‌లో మొదలుపెడతాం. అన్ని భాషా చిత్రాలూ చూస్తుంటారు కదా. కథల విషయంలో ఎవరు ముందున్నారంటారు? వందశాతం తమిళ సినిమానే. బాలీవుడ్ అంతా ఇప్పుడు మన సౌత్ సినిమాలపైనే ఆధారపడింది. ఇక తెలుగు సినిమా మాత్రం హీరోల ఇమేజ్‌లు, భారీ తనానికే ప్రాధాన్యత ఇస్తోంది. కానీ... తమిళంలో అలా కాదు. కథకే అక్కడ తొలి ప్రాముఖ్యత. ఇటీవల మీపై కూడా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. వాటిని వింటుంటే ఏమనిపిస్తుంది? పట్టించుకోను. అయితే.. ఈ మధ్య ఓ రూమర్ మాత్రం కాస్త ఇబ్బంది పెట్టింది. శ్రీయతో కలిసి నేను హిమాలయాలకు వెళ్లానట. ఆ రాసిన వారికి ఫోన్ చేశాను. నేను వెళ్లినట్లు మీకెలా తెలుసు? సాక్ష్యాలేమైనా ఉన్నాయా? హిమాలయాలంటే నాకిష్టం... వెళ్తాను. శ్రీయతో వెళ్లాల్సిన పనేంటి? అని అడిగేశాను. మా నాన్న అయితే.. నాపై ఇలాంటి రూమర్లు పేపర్లో రాగానే వాటిని కట్ చేసి దాచుకుంటారు. ఎందుకంటే మా అబ్బాయి పేరు న్యూస్ పేపర్లో వచ్చిందని ఆయన ఆనందం. ఇంతకూ మీ పెళ్లెప్పుడు? నేను పెళ్లికి రెడీ అవ్వలేదు. పెళ్లంటే ఒక పనిగా చేసుకోకూడదు. ఈ టైమ్‌కి బడికెళ్లాలి, ఈ టైమ్‌కి జాబ్ చేసుకోవాలి, ఈ టైమ్‌కి పెళ్లాడాలి అనే పద్ధతికి నేను పూర్తి విరుద్ధం. ఇంకా రెండేళ్ల వరకూ పెళ్లి ప్రస్తావనే రానీయను.