
‘అనంత’ ఆదరణ మరవలేను
– ఇష్టాగోష్టిలో కళాతపస్వి కె.విశ్వనాథ్
– ఆకట్టుకున్న చిన్నారుల నత్యాలు
అనంతపురం కల్చరల్ : ‘సినిమాలకు దూరంగా ఉన్నా.. అయినా అనంత వాసులు నన్నెంతో ఆదరించారు. దీనిని మరవలేను. అందరిలోనూ మా అమ్మను చూసుకుంటున్నాను’ అంటూ అనంత ప్రజానీకంపై కళాతపస్వి కె.విశ్వనాథ్ అభిమానాన్ని కురిపించారు. త్యాగరాజ సంగీత సభ 58వ వార్షికోత్సవ వేడుకల ముగింపు వేడుకల సందర్భంగా సభ అధ్యక్షుడు ఏజీ వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రఖ్యాత దర్శకులు విశ్వనాథ్ విశిష్ట అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
శాస్త్రీయ సంగీతానికి ఇప్పటికీ ఎంతో ఆదరణ ఉందని తానెక్కడకు వెళ్లినా అనిపిస్తుందని అన్నారు. సంప్రదాయ సంగీత సాహిత్యాలను ఈ తరం వారికి దగ్గర చేయాలని సూచించారు. శంకరాభరణం లాంటి సినిమాలే చాలా మంది చూడాలనుకుంటున్నారని చెబుతునప్పుడు మన సంస్కతి ఎంత ప్రభావితమైందో అర్థమవుతోందన్నారు. అనంతరం ఆహూతులతో ఇష్టాగోష్టి కార్యక్రమం జరిగింది. కళాభిమానులు అడిగిన ప్రశ్నలకు విశ్వనాథ్ సందర్భోచితమైన చమత్కారాలతో, పిట్ట కథలతో సమాధానాలు చెప్పిన తీరు అందరినీ అలరించింది.
అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఐజీ ప్రభాకరరావు, కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, డీఎస్పీ మల్లికార్జున వర్మ తదితరులతో కలసి ఆయన జిల్లా స్థాయి సంగీత పోటీల విజేతలకు బహుమతులందించారు. వివిధ రకాల నత్యాలతో మంత్ర ముగ్ధులను చేసిన పద్మినీ ప్రకాష్‌ను విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. చివరలో వివిధ సంస్థల వారు విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలు, శాలువలతో పాటు బంగారు నగలనూ బహుకరించారు.
ఆకట్టుకున్న శాస్త్రీయ నత్యాలు
ముగింపు వేడుకలను పురస్కరించుకుని కష్ణమూర్తి రాజు శిష్యబందం చేసిన శాస్త్రీయ నత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హరిచందన, యామిని, విష్ణుప్రియ, నీలోఫర్, సాత్విక తదితరులు శివస్తుతి, భామాకలాపం, నవరసాభినయం తదితర అంశాలపై అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను మైమరిపించారు. కార్యక్రమంలో కవి ఏలూరు ఎంగన్న, మేడా సుబ్రమణ్యం, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ శైలజ, సభ కార్యదర్శి ప్రభావతి, నాట్యాచార్యులు గీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.