తెలుగు సినిమా, ప్రేక్షకులే లైఫ్
నకిరేకల్ : తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులే తనకు లైఫ్ అని, తనను ఎంతగానో ఆధరిం చి జీవితంలో నిలబెట్టిన అభిమానులను మ రిచిపోలేనని సినీహీరో ఆకాష్ అన్నారు. ఆకాష్ నటించిన దొంగప్రేమ చిత్రం ఫంక్షన్‌లో పాల్గొనటానికి శనివారం హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్తూ మార్గమధ్యంలో నకిరేకల్‌లో కొద్ది సేపు ఆగారు. ఈ సందర్భంగా పట్టణంలోని రవి ఫ్లెక్సీ షాప్‌లో ఆకాష్ విలేకరులతో మాట్లాడారు. తెలుగుతో పాటు హిం దీ, కన్నడం, తమిళ సినిమాల్లో నటించినప్పటికీ తనకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులేనని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను హీరోగా నటించిన దొంగప్రేమ, ఆనం దం మళ్లీ మొదలైంది సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. ఈనెల 27న ఈరెండు సినిమాలను విడుదల చేయబోతున్నామని వివరిం చారు. వీటితో పాటు జన్మజన్మల బంధం, నాలో ఒక్కడు చిత్రాల షూ టిం గ్ జరుగుతుందన్నారు. అంతకుముందు ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకుడు తొనుపూనురి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికారు. హీరో ఆకాష్ చూసేందుకు ప్రేక్షకులు తరలివచ్చారు.