హెబ్బాతో 30 సినిమాలు చేయాలనుంది!
– రాజ్‌తరుణ్
‘‘టైటిల్ విని ‘అందగాడు’ ఏంటి? అనుకున్నా. తర్వాత ‘అంధగాడు’ అని తెలిసింది. కళ్లు లేని వ్యక్తిగా రాజ్ తరుణ్ బాగా చేయగలడనిపించింది. ట్రైలర్ బాగుంది’’ అన్నారు హీరో నిఖిల్. రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘అంధగాడు’ టీజర్‌ను నిఖిల్ రిలీజ్ చేశారు.
రాజ్‌తరుణ్ మాట్లాడుతూ – ‘‘ఆర్ట్ ఫిల్మ్ కాదిది. వెలిగొండగారు ప్రతి పావు గంటకు కథను ఒక్కో జోనర్‌లోకి తీసుకువెళ్లారు. నేను, హెబ్బా జంటగా నటించిన మూడో చిత్రమిది. తనతో మరో 30 సినిమాలు చేయాలనుంది’’ అన్నారు. ‘‘చాలా ట్విస్టులున్న కథ. నిర్మాతలకు వినిపించిన తర్వాత మీరే దర్శకత్వం వహించండన్నారు’’ అన్నారు వెలిగొండ శ్రీనివాస్. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, నటుడు రాజా రవీంద్ర పాల్గొన్నారు.