andhhagadu
-
అదరగొట్టిన 'అంధగాడు'.. రికార్డు కలెక్షన్లు!
రాజ్ తరుణ్ తాజా చిత్రం 'అంధగాడు' ఇటు విమర్శకుల ప్రశంసలే కాదు.. అటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నది. 'కుమారి' హెబ్బా పటేల్‌తో మరోసారి జతకట్టి.. ట్విస్టుల మీద ట్విస్టులతో అలరించిన 'అంధగాడు' తొలిరోజు ఏకంగా రూ. 3.75 కోట్లు వసూలు చేశాడు. వినూత్నమైన కథ-కథనాలతో వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అంధగాడు' సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఏకంగా కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం రాజ్ తరుణ్ సినిమా చాలా బాగుందని కితాబిచ్చాడు. గతంలో కామెడీ సినిమాలు, ఫన్నీ రోల్స్ చేసిన రాజ్ తరుణ్ 'అంధగాడు'లో తనలోని విలక్షణ నటనను చూపించాడని, కామెడీ ఎంటర్టైనర్గా ప్రారంభమై.. ఇంట్రస్టింగ్ సినిమాగా ఈ చిత్రం ముగిసిందని, ఇలాంటి జోనర్ చేంజింగ్ సినిమాలో హాలీవుడ్లో బాగా కనిపిస్తాయి కానీ తెలుగులో అంతగా రాలేదని, ఈ సినిమా తనకు బాగా నచ్చిందని వర్మ ప్రశంసించాడు. మొత్తానికి పాజిటివ్ టాక్, ప్రశంసలతో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్ తరుణ్, హెబ్బా కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. -
'అంధగాడు' చిత్రం దాసరికి అంకితం
దాసరి మరణంతో ఇండస్ట్రీ ఒకసారిగా దిగ్బ్రాంతికి గురైంది. పాత తరం నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే కాదు... ఈ జనరేషన్ సినీ ప్రముఖులు కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న అంధగాడు సినిమాను దాసరి అంకితమిస్తున్నట్టుగా వెల్లడించారు ఆ చిత్ర నిర్మాతలు. 'ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రపంచంలో ఏ దర్శకుడు తీయలేనని విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి 151 చిత్రాలకు దర్శకుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రాసుకున్న దర్శకరత్న డా.దాసరినారాయణరావుగారు పరమపదించడం మమ్మల్ని ఎంతో బాధకు గురి చేసింది. ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ ముందుకు వచ్చి నిలబడి న్యాయం చేకూర్చే గొప్ప వ్యక్తి దాసరిగారు. మంచి చిత్రాలకు ఆదరణ ఉండాలని, చిన్న నిర్మాతలు బావుండాలని కోరుకునే శ్రేయోభిలాషి ఆయన. మా ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌కు వెన్నంటి నిలిచారు. ఎంటర్టైన్మెంట్ను ఇష్టపడే దాసరిగారు మా సంస్థలో వచ్చిన ప్రతి సినిమాను ఆయన వీక్షించి యూనిట్‌కు తన ఆశీస్సులను అందచేసేవారు. . భౌతికంగా దాసరిగారు మనల్ని విడిచి పెట్టినా, ఆయన సినిమాల రూపంలో ఎప్పటికీ మన మధ్యనే ఉంటారు. మా సంస్థకు దాసరిగారు అందించిన సహాయ సహకారాలను మరచిపోలేం. మా బ్యానర్లో విడుదలవుతున్న 'అంధగాడు' చిత్రాన్ని దాసరిగారికి అంకితమిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్న'ట్టుగా తెలిపారు. -
హెబ్బాతో 30 సినిమాలు చేయాలనుంది!
– రాజ్‌తరుణ్ ‘‘టైటిల్ విని ‘అందగాడు’ ఏంటి? అనుకున్నా. తర్వాత ‘అంధగాడు’ అని తెలిసింది. కళ్లు లేని వ్యక్తిగా రాజ్ తరుణ్ బాగా చేయగలడనిపించింది. ట్రైలర్ బాగుంది’’ అన్నారు హీరో నిఖిల్. రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘అంధగాడు’ టీజర్‌ను నిఖిల్ రిలీజ్ చేశారు. రాజ్‌తరుణ్ మాట్లాడుతూ – ‘‘ఆర్ట్ ఫిల్మ్ కాదిది. వెలిగొండగారు ప్రతి పావు గంటకు కథను ఒక్కో జోనర్లోకి తీసుకువెళ్లారు. నేను, హెబ్బా జంటగా నటించిన మూడో చిత్రమిది. తనతో మరో 30 సినిమాలు చేయాలనుంది’’ అన్నారు. ‘‘చాలా ట్విస్టులున్న కథ. నిర్మాతలకు వినిపించిన తర్వాత మీరే దర్శకత్వం వహించండన్నారు’’ అన్నారు వెలిగొండ శ్రీనివాస్. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, నటుడు రాజా రవీంద్ర పాల్గొన్నారు. -
'ప్రపోజ్ చేస్తే రెజెక్ట్ చేశా'
-
'ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశా'
ఇంటర్నెట్ ప్రత్యేకం: 'ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశా.. ఇలా ఎంతమంది అమ్మాయిలతో..' ఇవి రాజ్‌తరుణ్-హెబ్బా పటేల్‌లు నటిస్తున్న అంధగాడు సినిమాలోని కొన్ని డైలాగ్స్. ఈ సినిమా థియెట్రికల్ ట్రైలర్‌ను శనివారం టీం విడుదల చేసింది. ట్రైలర్‌ను బట్టి రాజ్‌తరుణ్ ఈ సినిమాలో ఎఫ్ఎం రేడియోలో ఆర్జేగా చేస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీ పంచ్‌లతో.. యూత్‌ను ఆకట్టుకునే సీన్స్‌తో ట్రైలర్‌ను అందంగా మలిచారు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.