అదరగొట్టిన 'అంధగాడు'.. రికార్డు కలెక్షన్లు! | Andhagaadu record collections | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన 'అంధగాడు'.. రికార్డు కలెక్షన్లు!

Published Sat, Jun 3 2017 4:48 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

అదరగొట్టిన 'అంధగాడు'.. రికార్డు కలెక్షన్లు!

అదరగొట్టిన 'అంధగాడు'.. రికార్డు కలెక్షన్లు!

రాజ్‌ తరుణ్‌ తాజా చిత్రం 'అంధగాడు' ఇటు విమర్శకుల ప్రశంసలే కాదు.. అటు బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నది. 'కుమారి' హెబ్బా పటేల్‌తో మరోసారి జతకట్టి.. ట్విస్టుల మీద ట్విస్టులతో అలరించిన 'అంధగాడు' తొలిరోజు ఏకంగా రూ. 3.75 కోట్లు వసూలు చేశాడు.

వినూత్నమైన కథ-కథనాలతో వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'అంధగాడు' సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఏకంగా కాంట్రవర్సీ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ సైతం రాజ్‌ తరుణ్‌ సినిమా చాలా బాగుందని కితాబిచ్చాడు. గతంలో కామెడీ సినిమాలు, ఫన్నీ రోల్స్‌ చేసిన రాజ్‌ తరుణ్‌ 'అంధగాడు'లో తనలోని విలక్షణ నటనను చూపించాడని,

కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభమై.. ఇంట్రస్టింగ్‌ సినిమాగా ఈ చిత్రం ముగిసిందని, ఇలాంటి జోనర్‌ చేంజింగ్‌ సినిమాలో హాలీవుడ్‌లో బాగా కనిపిస్తాయి కానీ తెలుగులో అంతగా రాలేదని, ఈ సినిమా తనకు బాగా నచ్చిందని వర్మ ప్రశంసించాడు. మొత్తానికి పాజిటివ్‌ టాక్‌, ప్రశంసలతో ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్‌ తరుణ్‌, హెబ్బా కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement