
సింగిల్ సినిమాతో కుమారి అనిపించుకుంది. ఆ సినిమా తర్వాత హెబ్బా పటెల్ అంటే ‘ఎవరూ? కుమారి 21ఎఫ్ అమ్మాయా ?’ అని ఇప్పటికీ అడుగుతున్నారు. పోనీ పెళ్లి అయినా చేసుకుంటే ఈ గొడవ తప్పుతుంది అంటే.. సినిమాలకి, ఫ్యామిలీకి తప్ప మనస్సులో ఇంకెవరికీ చోటు లేదని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
హెబ్బా అంటే ‘గాడ్స్ గిఫ్ట్’ అని అర్థం. మూవీస్‌కి ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మీరని అనుకోవచ్చా?
(నవ్వేస్తూ). మా అమ్మానాన్నలకు ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నేను. సినిమాలకు నేను గిఫ్ట్ కాదు.. ఆ దేవుడు నాకిచ్చిన గిఫ్ట్ సినిమాలు.
ఇంకా దేవుడు మీకేమేం బహుమతులు ఇచ్చాడు?
నేను అనుకోకపోయినా హీరోయిన్‌ని చేశాడు. ఫేమస్ అవ్వాలనుకున్నాను. అది తీర్చేసేశాడు. ఏదో వచ్చాం.. సో..సోగా సినిమాలు చేసేసి వెళ్లిపోదామనుకోలేదు. నేను అనుకున్నట్లుగానే నాకు పేరు తెచ్చే సినిమాలే ఇస్తున్నాడు. ఇంతకు మించి దేవుణ్ణి ఏమైనా కోరుకుంటే బాగుండ దేమో. అయినా ఓ పెద్ద కల ఉంది. అది ఇప్పుడు చెప్పను.
జర్నలిస్ట్ అవ్వాలనుకుని మాస్ కమ్యూనికేషన్ చేశాను. చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం మోడల్స్‌కి స్టేజ్ హెల్పర్‌గా చేసేదాన్ని. అప్పుడెవరో మోడల్‌గా ట్రై చేయొచ్చు కదా అంటే, చేశాను. అవి చూసి, సినిమాలకు అవకాశం ఇచ్చారు. ముందు తమిళ సినిమా ‘తిరుమణమ్ ఎన్నుమ్ నిక్కా’, ఆ తర్వాత తెలుగులో ‘అలా ఎలా’కి చాన్స్ వచ్చింది. మధ్యలో ‘అధ్యక్ష’తో కన్నడకు పరిచయమయ్యా. ‘కుమారి 21ఎఫ్’ నా కెరీర్‌కి మంచి టర్నింగ్ అయింది.
పెద్ద హీరోల పక్కన నటిస్తే కెరీర్ ఇంకా పుంజుకుంటుంది కదా.. ట్రై చేయడంలేదా?
మీరన్నది కరెక్టే. కానీ అవకాశాలు వాటంతట అవి రావాలి. ఏదేమైనా ఇప్పుడు చేస్తున్న, చేసిన సినిమాలవైజ్‌గా నాకెలాంటి రిగ్రెట్స్ లేవు. ‘ఐయామ్ హ్యాపీ’.
ఆ విషయం చెప్పి, మీ ఫ్యాన్స్‌కి మీరు కూడా గిఫ్ట్ ఇవ్వొచ్చు కదా?
ఫ్యాన్స్ అంటున్నారు కాబట్టి, చెప్పేస్తున్నా. మరేం లేదు. పెద్ద ఇల్లు కొనాలనే కల ఉంది. అదీ నెరవేరుతుందనే నమ్మకం ఉంది.
తెలుగు, తమిళ, కన్నడంతో కలిపి పది సినిమాల దాకా చేసేశారు. ఇల్లు కొనడం మీకు పెద్ద కల అవుతుందా?
లెక్క చెప్పుకోవడానికి పది సినిమాలున్నాయి. కానీ, ఇంకా సెటిలవ్వడానికి చాలా టైమ్ పడుతుందండి. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అంటారు కదా.
సో.. ఇల్లు కట్టాక పెళ్లన్న మాట?
అయ్య బాబోయ్. ఏదో మాట వరసకి అన్నాను. అప్పుడే పెళ్లి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడను. ఇంకా చాలా సినిమాలు చేయాలి కదా.
హైదరాబాద్‌లో ఇల్లు ఎక్కడ కట్టుకోవాలనుకుంటున్నారు?
ఇక్కడ కాదు. ముంబైలో మంచి ఏరియాలో కొనుక్కోవాలనుకుంటున్నా. ఆ బాధ్యత మా ఇంట్లోవాళ్లకి అప్పగించేస్తాను.
క్యాష్ ఇక్కడ... ఇల్లు అక్కడా?
హైదరాబాద్ అంటే ఇష్టం లేక కాదు. కానీ, మావాళ్లంతా ముంబైలోనే ఉంటారు. హైదరాబాద్ షిఫ్ట్ కావడం వాళ్లకు ఇష్టంలేదు. ఇంట్లోవాళ్ల కంఫర్ట్ కోసం ముంబైలో ప్లాన్ చేశా. నా వరకు మాత్రమే అయితే ఇక్కడే ప్లాన్ చేసుకునేదాన్ని.
ఓకే.. బర్త్‌డే (06.01.) ఎలా జరుపుకున్నారు?
షూటింగ్ స్పాట్‌లోనే. నాకన్నా నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నా బర్త్‌డేని స్పెషల్‌గా ఫీలవుతారు. అది నాకు హ్యాపీగా ఉంటుంది.
హీరోయిన్ అయిన ఈ నాలుగేళ్లల్లో ఖాళీగా ఉన్న బర్త్‌డే ఏదైనా ఉందా?
లేదు. అమ్మో దిష్టి తగులుగుతుందేమో.. టచ్ ఉడ్ (దిష్టి తగలకుండా అలా అనుకుంటారు). యాక్చువల్లీ ఒక్క బర్త్‌డేకి ఖాళీగా ఉన్నా నేను బాధపడేదాన్ని. షూటింగ్ స్పాట్‌లో ఉండి, ‘ఓకే.. మనం బిజీగా ఉన్నాం’ అనే ఫీలింగ్ కన్నా వేరే ఆనందం ఏముంటుంది?
2017 ఎలా గడిచింది?
అప్ అండ్ డౌన్స్‌తో సాగింది. కొన్ని పాఠాలు నేర్పింది. ఆ లెసన్స్ 2018కి ఉపయోగపడతాయి. అందుకే గతేడాది కన్నా ఈ ఇయర్ బాగుంటుంద నుకుంటున్నా.
బర్త్‌డే సందర్భంగా కొత్త నిర్ణయాలేమైనా?
ఎక్కువ ఆశించకూడదు. సిన్సియర్‌గా పని చేయాలి. ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలను కుంటున్నాను. తక్కువ ఆశిస్తే ఏ బాధా ఉండదని అనుభవం నేర్పింది.
సిన్సియర్‌గా పని చేయాలనుకుంటున్నా అన్నారు. ఇప్పటివరకూ అలా చేయలేదా?
నిజానికి నన్ను నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. సినిమాలు ఒప్పుకోవడం, చేయడం అంతే. సినిమాల సెలక్షన్ విషయంలో కూడా పెద్దగా జాగ్రత్త తీసుకోలేదు. ఇకనుంచి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలనుకుంటున్నా.
‘కుమారి 21ఎఫ్’ రిలీజై రెండేళ్లకు పైనే అయినా మిమ్మల్ని కుమారి అంటున్నారు..
(నవ్వేస్తూ). అవునండి. ఎక్కడికెళ్లినా ‘కుమారి’ అంటున్నారు. ఇలా అయితే నా అసలు పేరుని మరచి పోతారేమో అనిపిస్తుంది. కానీ, ఒక పాత్ర అంత ఇంపాక్ట్ చూపించినందు కు హ్యాపీగా ఉంది. సేమ్ టైమ్ ‘కుమారి’ని మరిపించే పాత్ర చేయాలనుకుంటున్నా.
మీరేమో ‘సింపుల్ హోమ్లీ గర్ల్’లా కనిపి స్తారు. ‘కుమారి 21 ఎఫ్’లో అంత హాట్‌గా ఎలా యాక్ట్ చేశారా? అనిపిస్తుంటుంది..
నాకూ ఆశ్చర్యంగానే ఉంటుంది. నన్ను నేను హాట్ అనుకోలేదు. చూసేవాళ్లు కూడా అనుకోరు. అయితే సుకుమార్‌గారు, సూర్యప్రతాప్‌గారు కుమారి పాత్రకు నేను ఫిట్ అవుతాననుకున్నారు. వాళ్లేం చెబితే అది చేసేశా.
అంత బోల్డ్ క్యారెక్టర్ చేస్తే ‘బ్యాడ్ ఇమేజ్’ వస్తుందని భయపడలేదా?
ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆ టైమ్‌లో నా చేతిలో సినిమాలు లేవు. అది ఒప్పుకోవడం మినహా వేరే ఛాయిస్ లేదు. సుకుమార్‌గారి ప్రొడక్షన్ అంటే ఆలోచించడానికి ఏముంటుంది? పైగా టైటిల్ రోల్. ఇమేజ్ గురించి ఆలోచించకుండా ఒప్పుకున్నాను. నన్నింత ఫేమస్ చేస్తుంద నుకోలేదు. ‘కుమారి 21ఎఫ్’ నా జీవితాన్ని మార్చేసింది.
‘మిణుగురులు’ ఫేమ్ అయోధ్యకుమార్ డైరెక్షన్‌లో ‘శ్రీలక్ష్మి అండ్ 24 కిస్సెస్’ అనే సినిమా చేస్తున్నారట?
అవును. కానీ ఆ సినిమా గురించి ఇప్పుడేమీ చెప్పను. ఒక్కటి చెబుతాను. ‘కుమారి 21ఎఫ్’కన్నా ఇది ఫుల్ డిఫరెంట్‌గా ఉంటుంది.
అప్పుడప్పుడూ ఇద్దరు కథానాయికలున్న సినిమాలు చేస్తున్నారు. ప్రాబ్లమ్ అనిపించదా?
నో ప్రాబ్లమ్. మన బలం ఏంటో మనం తెలుసుకుంటే అభద్రతాభావం ఉండదు. నేను గొప్ప ఆర్టిస్ట్‌ని అని చెప్పడంలేదు కానీ ఏ క్యారెక్టర్ ఒప్పుకున్నా, దాన్ని అర్థం చేసుకుని యాక్ట్ చేయగల కెపాసిటీ ఉంది. ప్లస్ ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల కాంబినేషన్‌లో సినిమాలు చేసినా నా క్యారెక్టర్‌కీ కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది.
ఫైనల్లీ.. మీ మనసులో ఎవరో ఉన్నారట..
అవును. మా అమ్మానాన్న, ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు.
కాదు.. ఎవరో కుర్ర హీరో ఉన్నారట కదా?
ఎవరి కోసమూ మనసు ఖాళీ లేదు (నవ్వుతూ). ఐయామ్ సింగిల్.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment