
రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్
కొన్ని సినిమాలకు కాంబినేషన్ వల్ల క్రేజ్ ఏర్పడుతుంది. రాజ్‌తరుణ్–హెబ్బా పటేల్ లది అలాంటి కాంబినేషనే. ‘కుమారి 21 ఎఫ్, ఈడోరకం ఆడోరకం, అంధగాడు’ సినిమాల్లో కలసి నటించిన రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ నాలుగోసారి జత కట్టనున్నారని సమాచారం. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ తెలుగు రీమేక్‌లో ఈ యువ జంట కలసి నటించబోతోందట. విజయ్ సేతుపతి పాత్రను రాజ్ తరుణ్, నయనతార క్యారెక్టర్‌ను హెబ్బా పోషించనున్నారని సమాచారం. తమిళంలో ఈ చిత్రం పెద్ద హిట్. పెట్టిన బడ్జెట్‌కి మూడింతలు ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమా. మరి.. తెలుగు రీమేక్ ఉందా? అనేది వెయిట్ అండ్ సీ.
∙హెబ్బా పటేల్, రాజ్‌తరుణ్
Comments
Please login to add a commentAdd a comment