ఓదెల అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇందులో వశిష్ట సింహ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది.
మేకప్, డ్రీమ్ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కిస్తున్నాం. ఓదెలలో మొదటి షెడ్యూల్ పూర్తిచేశాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రెండో షెడ్యూల్‌లో చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు క్లయిమాక్స్‌ను చిత్రీకరిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజ¯Œ , సంగీతం: అనూప్ రూబెన్స్.
Comments
Please login to add a commentAdd a comment