sampat nandi
-
ఓదెలలో ఏం జరిగింది?
ఓదెల అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇందులో వశిష్ట సింహ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. మేకప్, డ్రీమ్ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కిస్తున్నాం. ఓదెలలో మొదటి షెడ్యూల్ పూర్తిచేశాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రెండో షెడ్యూల్లో చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు క్లయిమాక్స్‌ను చిత్రీకరిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజ¯Œ , సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఆగస్ట్‌లో కబడ్డీ కబడ్డీ
‘గౌతమ్‌నంద’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో గోపీచంద్ – డైరెక్టర్ సంపత్ నంది కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా, దిగంగన కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీ¯Œ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. నేడు గోపీచంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘సీటీమార్’ టీమ్ కొత్త స్టిల్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ–‘‘కబడ్డీ నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ ఏడాదే షూటింగ్ మొదలుపెట్టాం. కానీ లాక్ డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్‌లో 60 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. మిగిలిన భాగం చిత్రీకరణ ఆగస్ట్ మొదటివారంలో మొదలుపెట్టి ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నాం. ఒక పాట మినహా ఇప్పటికే నాలుగు పాటలు రికార్డ్ చేశారు సంగీత దర్శకుడు మణిశర్మ. మాస్ ప్రేక్షకుల కోసం ఒక ప్రత్యేక గీతాన్ని కంపోజ్ చేస్తున్నారాయన. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండబోతుంది’’ అన్నారు. కాగా ‘సీటీమార్’ చిత్రంలో ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. పల్లెటూరిలో ఉండి హీరోని ప్రేమించే ప్రత్యేక పాత్రలో దిగంగన నటిస్తున్నారు. ఈ సినిమాకి సమర్పణ: పవ¯Œ కుమార్. -
కోచ్ జ్వాల
కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా మారిపోయారు తమన్నా. ‘గౌతమ్‌నంద’ (2017) చిత్రం తర్వాత గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ‘సీటీమార్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా తమన్నా, దిగంగనా సూర్యవన్షీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసాచిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ మహిళల జట్టు కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా నటిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది కుమారుడు యువ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారు. శనివారం జ్వాలారెడ్డి లుక్‌ను విడుదల చేశారు. ‘‘నా పాత్ర చాలెంజింగ్‌గా, ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు తమన్నా. ‘‘హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాం. సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి. -
ఆట ఆరంభం
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. భూమిక, రావు రమేష్, దిగంగన సూర్యవంశి కీలక పాత్రధారులు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. అంటే ఆరంభమైందన్నమాట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ–‘‘హైదరాబాద్‌లో మొదలైన తొలి షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశాం. ఆ నెక్ట్స్ రాజమండ్రి, ఢిల్లీల్లో షూటింగ్ జరుగుతుంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: దక్షిణ మధ్య రైల్వే నూతన జీఎంగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన రవీంద్ర గుప్తా తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్న గుప్తా కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. అలాగే, సినీ దర్శకుడు సంపత్‌నంది కూడా తన కుటుంబ సభ్యులతో కలసి స్వామిని దర్శించుకున్నారు. ఛత్తీస్‌గఢ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రామ్ సీలా సాహు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీవీ రెడ్డి, ఎమ్మెల్సీ వీవీసీ చౌదరి, మాల మహానాడు జాతీయ కార్యదర్శి కారెం శివాజీతదితరులు కూడా స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.