ఎందుకో ఏమో పోస్టర్
మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు,నోయల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ఎందుకో ఏమో. కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు స్టార్ డైరక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ...‘‘ ఎందుకో ఎమో’ టైటిల్ లాగే టీజర్ కూడా చాలా ట్రెండీగా, ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న కోటికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు’’ అన్నారు.
దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ...‘‘ ఎందుకో ఎమో’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నా. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా మా చిత్రం టీజర్ ఆవిష్కరించిన వి.వి.వినాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నందు, నోయల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరి. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా, పూర్తి స్వేచ్ఛ నివ్వడంతో అనుకున్నట్టుగా సినిమా తీయగలిగాం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేసి, అదే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత మాలతి వద్దినేని మాట్లాడుతూ...‘‘ మహేశ్వర క్ర్రియేషన్స్ పతాకంపై ఇది మా తొలి సినిమా. వినాయక్ గారి చేతుల మీదుగా మా చిత్రం టీజర్ విడుదల కావడం శుభసూచకంగా భావిస్తున్నాం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమాను ఏ విషయంలో రాజీ పడకుండా నిర్మించాం. మంచి లవ్ స్టోరీ తో పాటు కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. మా యూనిట్ అంతా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో సినిమాను అనుకున్నవిధంగా పూర్తి చేయగలిగాం. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేసి సినిమాను కూడా అదే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment