Singer Noel Sean Announces his Divorce with wife Esther | విడాకులు తీసుకుంటున్నాం, నోయల్‌ - Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకున్నాం: నోయల్‌

Published Tue, Sep 1 2020 12:24 PM | Last Updated on Tue, Sep 1 2020 5:42 PM

Rumoured Bigg Boss Telugu 4 Contestant Noel Announces Divorce With Ester - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ ర్యాపర్‌, టాలీవుడ్‌ నటుడు నోయల్‌ మంగళవారం అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు. భార్య ఎస్తర్‌ నుంచి తాను విడాకులు తీసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే డివోర్స్‌ కోసం దరఖాస్తు చేశామని, ఇన్నాళ్లు కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూసినట్లు తెలిపాడు. అభిప్రాయ భేదాల కారణంగా తాము విడిపోతున్నామని, తమ మధ్య ఉన్న అందమైన బంధాన్ని, దాని విలువను కాపాడుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎస్తర్‌ భవిష్యత్‌ బాగుండాలని, తనకు అంతా మంచే జరగాలని, తను కన్న కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. విడాకుల విషయంలో తన కుటుంబాన్ని గానీ, ఎస్తర్‌ను గానీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశాడు.

అలాగే కష్ట సమయాల్లో తనకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నోయల్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. సరికొత్త ఆశలతో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్‌ను షేర్‌ చేశాడు. ఇక ఎస్తర్‌ సైతం విడాకుల విషయాన్ని ధ్రువీకరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్‌ చేసి సుదీర్ఘ క్యాప్షన్‌ జతచేశారు.(చదవండి: నోయ‌ల్‌కు క‌రోనా: 'దీని గురించి త‌ర్వాత మాట్లాడ‌తా!'

కాగా ప్రముఖ డైరెక్టర్‌ తేజ దర్శకత్వం వహించిన 'వెయ్యి అబద్ధాలు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్‌- నోయెల్‌ గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రేమపెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా సఖ్యత చెడిందని రూమర్లు వినిపించాయి. ఇక ఈ రోజు నోయల్‌ తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో వదంతులు నిజమేనని నిరూపితమైంది.

ఇక కెరీర్‌ విషయానికొస్తే ఎస్తర్‌ తెలుగు, తమిళ్‌, మరాఠీతో పాటు హిందీ సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అట్టహాసంగా ప్రారంభం కానున్న తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో నోయెల్‌ పాల్గొనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాక షో కోసం క్వారంటైన్‌లో ఉన్న అతడికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే నోయెల్‌ వాటన్నింటినీ కొట్టిపడేశాడు.

I am Officially Divorced! After a long hard silence, today I officially announce my divorce with Ester. We were waiting for courts decision to make it public. We had our differences which led to this & finally we decided to end this only to save the grace of this beautiful relationship. God bless you Ester & may all your dreams come true, wishing you nothing but the best. I request everyone to be supportive of this at this point of time & help us to heal from it. It will always be a beautiful phase of my life & I thank God for each & every day in it. I request everyone not to bother her or my family in any ways & I want to thank my family,friends & everyone who stood by me in my dark days. But Yes God Is Good All The Time & I Believe This Is A Great New Beginning! God Bless!

A post shared by Noel (@mr.noelsean) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement