సమయం లేదు | Noel sean starrer samayam ledu mitrama movie launched | Sakshi
Sakshi News home page

సమయం లేదు

Published Mon, Nov 19 2018 3:15 AM | Last Updated on Mon, Nov 19 2018 3:15 AM

Noel sean starrer samayam ledu mitrama movie launched - Sakshi

నోయల్‌

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలోని ‘సమయం లేదు మిత్రమా..’ డైలాగ్‌ ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకంటే ‘సమయం లేదు మిత్రమా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. నోయల్‌ హీరో. ట్వింకిల్‌ సౌజ్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఎమ్‌. వరప్రసాద్‌ దర్శకత్వంలో కె.వి.ప్రొడక్షన్‌ బ్యానర్‌లో జీఎమ్‌ మురళీధర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎమ్‌. వరప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది.

ఈ చిత్రానికి చాలా మంచి టెక్నీషియన్లు కుదిరారు’’ అన్నారు. ‘‘ఇది నా మొదటి చిత్రం. వరప్రసాద్‌ చెప్పిన కథ, కథనం నచ్చడంతో సినిమా నిర్మించడానికి ముందుకొచ్చాం’’ అని జీఎమ్‌  మురళీధర్‌ అన్నారు. ‘‘ఇందులో చాలా మంచి పాత్ర చేస్తున్నాను. ఈ సినిమా నాకు చాలా ప్లస్‌ అవుతుంది’’ అన్నారు నోయల్‌. ‘‘స్టోరీ బాగా కుదిరింది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఈ చిత్రం నిర్మిస్తాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మాంచాల కిషన్‌. నటుడు నగేష్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: చల్లా మహేష్, అశోక్‌గౌడ్, సంగీతం: అజయ్‌పట్నాయక్, కెమెరా: ప్రవీణ్‌ కె.కావళి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement