సింగర్ గీతా మాధురి, నటుడు నందూలది ప్రేమ వివాహం. 2014లో పెళ్లి చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. వారి సరదా గొడవలను, అల్లరి పనులను ఈ జంట సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే రెండేళ్ల క్రితం నందూ, గీతా మాధురి విడాకులు తీసుకోనున్నారంటూ ప్రచారం జరిగింది. మస్పర్థల కారణంగా విడిపోతున్నారని టాక్ నడిచింది. దీనిపై అటు గీతా మాధురి, ఇటు నందు స్పందించకుండా లైట్ తీసుకున్నారు. తాజాగా నందు మాన్షన్ 24 వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా గతంలో వచ్చిన విడాకుల రూమర్స్ గురించి స్పందించాడు. తనకు, గీతా మాధురికి గొడవలవుతున్నాయని, విడిపోతున్నామంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తలను చూసి తామిద్దరం నవ్వుకున్నామని చెప్పాడు. ఇలాంటి వార్తలను తాము పెద్దగా పట్టించుకోమన్నాడు.
ఇకపోతే మాన్షన్ 24 వెబ్ సిరీస్‌లో నందు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించింది. సత్యరాజ్, రావు రమేశ్, అవికా గోర్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అక్టోబర్ 17 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment