నలుగురి కథ | Inthalo Ennenni Vinthalo Press Meet | Sakshi
Sakshi News home page

నలుగురి కథ

Published Sun, Mar 25 2018 12:59 AM | Last Updated on Sun, Mar 25 2018 12:59 AM

Inthalo Ennenni Vinthalo Press Meet - Sakshi

వరప్రసాద్, రామమోహన రావు

నందు, సౌమ్య వేణుగోపాల్, పూజ రామచంద్రన్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. వరప్రసాద్‌ వరికూటి దర్శకత్వంలో హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్‌. శ్రీకాంత్‌ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరప్రసాద్‌ వరికూటి మాట్లాడుతూ– ‘‘ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి కాన్ఫిడెన్స్‌ ఉందో ఇప్పటికీ అదే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం.

కథ, స్క్రీన్‌ప్లే హైలైట్‌. ఆరోగ్యకరమైన గార్డెన్‌ నుంచి ఒక ఫ్రూట్‌ బయటకు వస్తే ఎలా ఫీల్‌ అవుతారో ఆ ఫ్రెష్‌ ఫీల్‌ను మా సినిమా చూసిన ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ‘‘నలుగురి మధ్య ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవల పాటలు విడుదల చేశాం.  3 పాటలు చాలా బాగున్నాయని అందరూ అభినందిస్తున్నారు’’ అని రామమోహన రావు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌. మోహన్‌రెడ్డి, సంగీతం: యాజమాన్య, సహనిర్మాత: డి. శ్రీనివాస్‌ ఓంకార్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement