సినిమాపై మరింత ఇష్టం పెరిగింది | Producer Rammohan Rao Ippili Happy about inthalo ennenni vinthalo | Sakshi
Sakshi News home page

సినిమాపై మరింత ఇష్టం పెరిగింది

Published Sun, Apr 15 2018 12:48 AM | Last Updated on Sun, Apr 15 2018 12:48 AM

Producer Rammohan Rao Ippili Happy about inthalo ennenni vinthalo - Sakshi

రామ్మోహన్‌రావు ఇప్పిలి

‘‘సినిమాలంటే ప్యాషన్‌తో ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ రూపొందించా. ఈ చిత్రం విజయంతో సినిమా పట్ల ఉన్న ఇష్టం మరింత పెరిగింది. ప్రేక్షకులు, ఫ్రెండ్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’’ అని నిర్మాత రామ్మోహన్‌రావు ఇప్పిలి అన్నారు.

నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్‌ ముఖ్య తారలుగా వరప్రసాద్‌ వరికూటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్‌. శ్రీకాంత్‌ రెడ్డి, రామ్మోహన్‌రావు ఇప్పిలి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదలైంది. ఈ సందర్భంగా రామ్మోహన్‌రావు ఇప్పిలి మాట్లాడుతూ– ‘‘మా చిత్రానికి  ఇప్పటికీ థియేటర్స్‌ పెరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహిస్తాం. మా హరిహర చలనచిత్ర బ్యానర్‌లో 2వ ప్రాజెక్ట్‌ని త్వరలో అనౌన్స్‌ చేస్తాం’’ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement