Sowmya Venu gopal
-
అది మా అదృష్టం
‘‘మూడు పువ్వులు ఆరు కాయలు’ సినిమా మూడు సార్లు ఆగిపోయింది. ఆరు మంది నిర్మాతలు మారారు. చివరకు మా ఫ్రెండ్ వబ్బిన వెంకట్రావు నిర్మాతగా ఈ సినిమా పూర్తి చేశాం’’ అని డైరెక్టర్ రామస్వామి అన్నారు. ‘‘అర్ధనారి’ ఫేమ్ అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమా చౌదరి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. డాక్టర్ మల్లె శ్రీనివాస్ సమర్పణలో వెంకట్రావు నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో రామస్వామి మాట్లాడుతూ– ‘‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా గురువారం విడుదలైంది. మా సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. ఆ చిత్రానికి మేం పోటీ కాదు. మాకు ఎన్టీఆర్ గారంటే గౌరవం, త్రివిక్రమ్‌గారంటే ఇష్టం. వాళ్ల సినిమా మధ్య మా చిత్రం విడుదల చేయడం మా అదృష్టం. ఆ సినిమాకు వచ్చిన ఓవర్ ఫ్లోతో మా హాల్ నిండినా చాలనుకున్నాం’’ అన్నారు. డా.మల్లె శ్రీనివాసరావు, భరత్ బండారు, వబ్బిన వెంకట్రావు, సంగీత దర్శకుడు కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు. -
చచ్చేదాకా కలిసి ఉండటమే
‘అర్ధనారి’ ఫేమ్ అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమా చౌదరి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. రామస్వామి దర్శకత్వంలో డాక్టర్ మల్లె శ్రీనివాస్ సమర్పణలో వెంకట్రావు నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. పాటల రచయిత భాస్కరభట్ల, సంగీత దర్శకుడు సాయికార్తీక్ చిత్ర ట్రైలర్‌ను, పాటలను విడుదల చేశారు. రామస్వామి మాట్లాడుతూ– ‘‘ప్రేమంటే చంపుకోవడమో, చావడమో కాదు.. చచ్చేదాకా కలిసి బతకటం. కన్నవాళ్ల కలలతో పాటు, ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగితే ప్రతి ఒక్కరి జీవితం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా వర్ధిల్లుతుంది. మా నిర్మాత, సమర్పకులే నన్ను నడిపించారు. మా చిత్రంలో చంద్రబోస్‌గారు రాసిన పాట గురించి ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటారు’’ అన్నారు. ‘‘మా స్మైల్ పిక్చర్స్ బ్యానర్లో ఇది తొలి సినిమా. మా టీమ్ చాలా కష్టపడి చేశారు’’ అన్నారు వెంకట్రావు. చిత్ర సమర్పకులు డా. మల్లె శ్రీనివాస్, డైరెక్టర్ దేవీప్రసాద్, నటులు భరత్, అర్జున్ యజత్, పావని, సీమా చౌదరి, సంగీత దర్శకుడు కృష్ణసాయి, ఆర్ట్ డైరక్టర్ రమణ, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమాపై మరింత ఇష్టం పెరిగింది
‘‘సినిమాలంటే ప్యాషన్‌తో ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ రూపొందించా. ఈ చిత్రం విజయంతో సినిమా పట్ల ఉన్న ఇష్టం మరింత పెరిగింది. ప్రేక్షకులు, ఫ్రెండ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’’ అని నిర్మాత రామ్మోహన్రావు ఇప్పిలి అన్నారు. నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్ ముఖ్య తారలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్రావు ఇప్పిలి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదలైంది. ఈ సందర్భంగా రామ్మోహన్రావు ఇప్పిలి మాట్లాడుతూ– ‘‘మా చిత్రానికి ఇప్పటికీ థియేటర్స్ పెరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహిస్తాం. మా హరిహర చలనచిత్ర బ్యానర్లో 2వ ప్రాజెక్ట్‌ని త్వరలో అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. -
పెళ్లికి 36 గంటల ముందు...
‘‘నేను మలయాళీ అమ్మాయిని. పుట్టింది మాత్రం బెంగళూరులో. నాన్న ఆర్మీ ఆఫీసర్. సౌత్, నార్త్‌తో పాటు ఇండియాలోని మొత్తం అన్ని రాష్ట్రాలూ ట్రావెల్ చేశా. సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించా. తెలుగులో నా తొలి చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’’ అన్నారు పూజ రామచంద్రన్. నందు కథానాయకునిగా, పూజ రామచంద్రన్, సౌమ్య వేణుగోపాల్ కథానాయికలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహనరావు ఇప్పిలి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ –‘‘ఇందులో నా పాత్ర పేరు తార. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. పెళ్లికి 36 గంటల ముందు ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో కథ సాగుతుంది. ఎమోషన్స్, పాటలు, ఫైట్స్, వినోదం ఉన్న ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. వరప్రసాద్సార్గారు చాలా క్లారిటీగా 38 రోజుల్లో ఈ చిత్రం పూర్తి చేశారు. తనకు ఏం కావాలో మా నుంచి రాబట్టుకున్నారు. ప్రేక్షకులు మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
నలుగురి కథ
నందు, సౌమ్య వేణుగోపాల్, పూజ రామచంద్రన్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరప్రసాద్ వరికూటి మాట్లాడుతూ– ‘‘ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉందో ఇప్పటికీ అదే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. కథ, స్క్రీన్‌ప్లే హైలైట్. ఆరోగ్యకరమైన గార్డెన్ నుంచి ఒక ఫ్రూట్ బయటకు వస్తే ఎలా ఫీల్ అవుతారో ఆ ఫ్రెష్ ఫీల్‌ను మా సినిమా చూసిన ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ‘‘నలుగురి మధ్య ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవల పాటలు విడుదల చేశాం. 3 పాటలు చాలా బాగున్నాయని అందరూ అభినందిస్తున్నారు’’ అని రామమోహన రావు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మోహన్‌రెడ్డి, సంగీతం: యాజమాన్య, సహనిర్మాత: డి. శ్రీనివాస్ ఓంకార్. -
సాయంత్రం నుంచి ఉదయం వరకూ..
నందు, సౌమ్యవేణుగోపాల్, పూజ రామచంద్రన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో హరహర చలనచిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్రావు ఇప్పిలి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. నందు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు సాయంకాలం మొదలై రేపు ఉదయం వరకు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ. నా గత సినిమాల కంటే ఈ చిత్రవిజయంపై ఎక్కువ నమ్మకంగా ఉన్నా. ఈ సినిమాలో నాతో పాటు నటించిన ముగ్గురు కూడా హీరోలే. మార్చి నుంచి థియేటర్స్ బంద్ అంటున్నారు. అది లేకుంటే మార్చి 2న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. రషెస్ చూసినవాళ్లు ప్రశంసించారు. విడుదలకు రెండు రోజుల ముందే ప్రెస్ వారికి ప్రివ్యూ వేయాలనుకుంటున్నామంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. మంచి చిత్రంలో నటించామని సౌమ్యవేణుగోపాల్, పూజరామచంద్రన్ అన్నారు. -
ఎన్ని వింతలో...
దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. నందు, సౌమ్య వేణుగోపాల్ జంటగా పూజా రామచంద్రన్ కీలక పాత్రలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘వరప్రసాద్ దర్శకుడిగా మారి, ఓ సినిమా చేస్తున్నాడని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యా. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా వరప్రసాద్‌కి మంచి హిట్ ఇచ్చి, పెద్ద హీరోలతో సినిమా తీసే రేంజ్‌కి ఎదగాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఉత్కంఠభరితమైన కథనంతో విభిన్నంగా ఉండే చిత్రమిది. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. వినాయక్‌గారు ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది’’ అని ఇప్పిలి రామమోహనరావు అన్నారు. నల్లవేణు, దువ్వాసి మోహన్, కౌశిక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: డి.శ్రీనివాస్ ఓంకార్, కెమెరా: ఎస్. మురళీమోహన్ రెడ్డి, సంగీతం: యాజమాన్య. -
కొత్తగా సరికొత్తగా...
ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన వరప్రసాద్ వరికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందు, సౌమ్యవేణుగోపాల్ జంటగా ఆయన దర్శకత్వంలో హరి హర చలనచిత్ర పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నూతన సంవత్సర సందర్భంగా ప్రముఖ కెమెరామ్యాన్ ఛోటా.కె. నాయుడు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘గతంలో ‘వరప్రసాద్ ఐ ఫోన్’ అనే వినూత్నమైన షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించా. పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కేటగిరిల్లో అవార్డులు అందుకున్నా. ప్రస్తుతం చేస్తున్న ‘ఇంతలో ఎన్నెని వింతలో’ ఫ్యామిలీ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. షూటింగ్ 50 శాతం పూర్తయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవరూ టచ్ చేయని కథాంశంతో తీస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మురళి మోహన్‌రెడ్డి, సంగీతం: యాజమాన్య, లైన్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ ఓంకార్.