పూజ రామచంద్రన్
‘‘నేను మలయాళీ అమ్మాయిని. పుట్టింది మాత్రం బెంగళూరులో. నాన్న ఆర్మీ ఆఫీసర్. సౌత్, నార్త్‌తో పాటు ఇండియాలోని మొత్తం అన్ని రాష్ట్రాలూ ట్రావెల్ చేశా. సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించా. తెలుగులో నా తొలి చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’’ అన్నారు పూజ రామచంద్రన్. నందు కథానాయకునిగా, పూజ రామచంద్రన్, సౌమ్య వేణుగోపాల్ కథానాయికలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహనరావు ఇప్పిలి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ –‘‘ఇందులో నా పాత్ర పేరు తార. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. పెళ్లికి 36 గంటల ముందు ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో కథ సాగుతుంది. ఎమోషన్స్, పాటలు, ఫైట్స్, వినోదం ఉన్న ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. వరప్రసాద్‌సార్‌గారు చాలా క్లారిటీగా 38 రోజుల్లో ఈ చిత్రం పూర్తి చేశారు. తనకు ఏం కావాలో మా నుంచి రాబట్టుకున్నారు. ప్రేక్షకులు మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment