inthalo ennenni vinthalo
-
సినిమాపై మరింత ఇష్టం పెరిగింది
‘‘సినిమాలంటే ప్యాషన్‌తో ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ రూపొందించా. ఈ చిత్రం విజయంతో సినిమా పట్ల ఉన్న ఇష్టం మరింత పెరిగింది. ప్రేక్షకులు, ఫ్రెండ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’’ అని నిర్మాత రామ్మోహన్రావు ఇప్పిలి అన్నారు. నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్ ముఖ్య తారలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్రావు ఇప్పిలి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదలైంది. ఈ సందర్భంగా రామ్మోహన్రావు ఇప్పిలి మాట్లాడుతూ– ‘‘మా చిత్రానికి ఇప్పటికీ థియేటర్స్ పెరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహిస్తాం. మా హరిహర చలనచిత్ర బ్యానర్లో 2వ ప్రాజెక్ట్‌ని త్వరలో అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. -
‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇంతలో ఎన్నెన్ని వింతలో జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : నందు, పూజ రామచంద్రన్, సౌమ్య వేణుగోపాల్ సంగీతం : యాజమాన్య దర్శకత్వం : వరప్రసాద్ వరికోటి నిర్మాత : ఎస్. శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామ్మోహన్ రావు యువ నటుడు నందు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో. హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా కాలంగా కష్టపడుతున్న నందు ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని భావిస్తున్నాడు. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నందుకు ఆశించిన విజయాన్ని అందించిందా..? ఘన విజయాలుసాధిస్తున్న చిన్న సినిమాల సరసన ఇంతలో ఎన్నెన్ని వింతలు చేరిందా..? కథ : విష్ణు (నందు).. మోడ్రన్ శ్రీరామ చంద్రుడు లాంటి కుర్రాడు. వ్యవహారశైలిలో గాని వ్యక్తిత్వంలో గాని ఎలాంటి మచ్చలేని మంచి కుర్రాడు. విష్ణులోని ఆ మంచితనం చూసే వందన (సౌమ్య వేణుగోపాల్) ప్రేమలో పడుతుంది. ఓలెక్స్ ద్వారా పరిచయం అయిన విష్ణు, వందనలు ఒకరికొకరు నచ్చటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెద్దలు కూడా అంగీకరించటంతో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేస్తారు. పెళ్లిపనులన్ని పూర్తి చేసిన విష్ణు తెల్లవారితే పెళ్లి అనగా ఫ్రెండ్స్ కలిసి బ్యాచిలర్స్ పార్టీ చేసుకోవడానికి ఓ రెస్టారెంట్‌కి వెళతాడు. అక్కడ తార (పూజ రామచంద్రన్) విష్ణు గ్యాంగ్‌కు కలుస్తుంది. తార పరిచయం కారణంగా విష్ణు అతని స్నేహితులు ఇబ్బందుల్లో పడతారు. ఈ ఇబ్బందులను దాటుకొని విష్ణు ముహూర్తం సమయానికి పెళ్లి మండపానికి చేరుకున్నాడా..? అసలు తార వల్ల ఎదురైన ఇబ్బందులు ఏంటి..? వాటిని విష్ణు ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ. విశ్లేషణ : హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న నందు అన్నీ మంచి లక్షణాలే ఉన్న అబ్బాయి పాత్రలో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్‌తోనూ మెప్పించాడు. హీరోయిన్ సౌమ్య వేణుగోపాల్ కు పెద్దగా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కక పోయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. తారా పాత్రలో పూజా రామచంద్రన్ మెప్పించింది. ఫస్ట్ హాఫ్‌లో హాట్ లుక్స్ ఆకట్టుకున్న పూజా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ లో పరవాలేదనిపించింది. ఇతర పాత్రల్లో పెద్దగా గుర్తింపు ఉన్న నటులు కనిపించలేదు. కాస్టింగ్ ఇంకాస్త బాగుండి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. తనకున్న బడ్జెట్ పరిదిలో ఓ మంచి ఎంటర్టైనర్ తీయాలనుకున్న దర్శకుడు వర ప్రసాద్ విజయం సాధించాడనే చెప్పాలి. అనుకున్న కథను ఎక్కడా గాడి తప్పకుండా ఆడియన్స్ ను కదలకుండా కూర్చో బెట్టేలా కథా కథనాలను నడిపించాడు. టైటిల్‌కు తగ్గట్టుగా సినిమాలో ఎన్నో ట్విస్ట్ లు చూపించి మెప్పించాడు. కథా కథనాలకు అవసరం లేకపోయినా పాటలను ఇరికించకుండా కథలో భాగంగా వచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ తో సినిమా వేగం తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. యాజమాన్య అందించిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. అక్కడక్కడా తడబడినా ఓవరాల్‌గా సినిమాను ఎంటర్టైనింగ్ తెరకెక్కించటంలో చిత్రయూనిట్ విజయం సాధించిందనే చెప్పాలి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం నందు నటన మైనస్ పాయింట్స్ : సహాయ పాత్రల్లోని నటులు అక్కడక్కడా నెమ్మదించిన కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
పెళ్లికి 36 గంటల ముందు...
‘‘నేను మలయాళీ అమ్మాయిని. పుట్టింది మాత్రం బెంగళూరులో. నాన్న ఆర్మీ ఆఫీసర్. సౌత్, నార్త్‌తో పాటు ఇండియాలోని మొత్తం అన్ని రాష్ట్రాలూ ట్రావెల్ చేశా. సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించా. తెలుగులో నా తొలి చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’’ అన్నారు పూజ రామచంద్రన్. నందు కథానాయకునిగా, పూజ రామచంద్రన్, సౌమ్య వేణుగోపాల్ కథానాయికలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహనరావు ఇప్పిలి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ –‘‘ఇందులో నా పాత్ర పేరు తార. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. పెళ్లికి 36 గంటల ముందు ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో కథ సాగుతుంది. ఎమోషన్స్, పాటలు, ఫైట్స్, వినోదం ఉన్న ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. వరప్రసాద్సార్గారు చాలా క్లారిటీగా 38 రోజుల్లో ఈ చిత్రం పూర్తి చేశారు. తనకు ఏం కావాలో మా నుంచి రాబట్టుకున్నారు. ప్రేక్షకులు మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
నలుగురి కథ
నందు, సౌమ్య వేణుగోపాల్, పూజ రామచంద్రన్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరప్రసాద్ వరికూటి మాట్లాడుతూ– ‘‘ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉందో ఇప్పటికీ అదే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. కథ, స్క్రీన్‌ప్లే హైలైట్. ఆరోగ్యకరమైన గార్డెన్ నుంచి ఒక ఫ్రూట్ బయటకు వస్తే ఎలా ఫీల్ అవుతారో ఆ ఫ్రెష్ ఫీల్‌ను మా సినిమా చూసిన ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ‘‘నలుగురి మధ్య ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవల పాటలు విడుదల చేశాం. 3 పాటలు చాలా బాగున్నాయని అందరూ అభినందిస్తున్నారు’’ అని రామమోహన రావు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మోహన్‌రెడ్డి, సంగీతం: యాజమాన్య, సహనిర్మాత: డి. శ్రీనివాస్ ఓంకార్. -
సాయంత్రం నుంచి ఉదయం వరకూ..
నందు, సౌమ్యవేణుగోపాల్, పూజ రామచంద్రన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో హరహర చలనచిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్రావు ఇప్పిలి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. నందు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు సాయంకాలం మొదలై రేపు ఉదయం వరకు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ. నా గత సినిమాల కంటే ఈ చిత్రవిజయంపై ఎక్కువ నమ్మకంగా ఉన్నా. ఈ సినిమాలో నాతో పాటు నటించిన ముగ్గురు కూడా హీరోలే. మార్చి నుంచి థియేటర్స్ బంద్ అంటున్నారు. అది లేకుంటే మార్చి 2న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. రషెస్ చూసినవాళ్లు ప్రశంసించారు. విడుదలకు రెండు రోజుల ముందే ప్రెస్ వారికి ప్రివ్యూ వేయాలనుకుంటున్నామంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. మంచి చిత్రంలో నటించామని సౌమ్యవేణుగోపాల్, పూజరామచంద్రన్ అన్నారు. -
ఎన్ని వింతలో...
దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. నందు, సౌమ్య వేణుగోపాల్ జంటగా పూజా రామచంద్రన్ కీలక పాత్రలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘వరప్రసాద్ దర్శకుడిగా మారి, ఓ సినిమా చేస్తున్నాడని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యా. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా వరప్రసాద్‌కి మంచి హిట్ ఇచ్చి, పెద్ద హీరోలతో సినిమా తీసే రేంజ్‌కి ఎదగాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఉత్కంఠభరితమైన కథనంతో విభిన్నంగా ఉండే చిత్రమిది. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. వినాయక్‌గారు ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది’’ అని ఇప్పిలి రామమోహనరావు అన్నారు. నల్లవేణు, దువ్వాసి మోహన్, కౌశిక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: డి.శ్రీనివాస్ ఓంకార్, కెమెరా: ఎస్. మురళీమోహన్ రెడ్డి, సంగీతం: యాజమాన్య. -
నందులో అలాంటి నటుణ్ణి చూశా
– బోయపాటి ‘‘నందు ఆల్ రౌండర్. ఏ తరహా పాత్రలోనైనా... దర్శకుడు కోరుకున్నట్లు కనిపించగలడు. నందులో అలాంటి నటుణ్ణి చూశా. ఇదొక్కటే కాదు... ముందు ముందు నందు నటించే చిత్రాలూ హిట్టవ్వాలి. వాటిలో ఈ సినిమా ముందుండాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. నందు, సౌమ్య వేణుగోపాల్ జంటగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో ఎస్. శ్రీకాంత్‌రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మించిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. పూజ రామచంద్రన్ కీలకపాత్ర చేశారు. ఆదివారం నందు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బోయపాటి శ్రీను విడుదల చేశారు. అనంతరం నందు మాట్లాడుతూ– ‘‘బోయపాటి గారు నాకు దేవుడిచ్చిన అన్నయ్య. ‘జయ జానకి నాయక’లో మంచి పాత్ర ఇచ్చారు. దాంతో నాకు బాగా గుర్తింపు వచ్చింది. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే, మంచి కథాంశంతో తెరకెక్కింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. ‘‘ఉత్కంఠభరితమైన కథనంతో విభిన్నంగా ఉండే చిత్రమిది. అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సహనిర్మాత: డి. శ్రీనివాస్ ఓంకార్, కెమెరా: ఎస్. మురళీమోహన్‌రెడ్డి, సంగీతం: యాజమాన్య.