
ఆ తప్పు మళ్లీ చేయను!
హీరోగా చేయడంతో పాటు సపోర్టింగ్ రోల్స్, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు నందు. ఈ రోజు ఈ యువ నటుడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పత్రికల వారితో నందు మాట్లాడుతూ - ‘‘నేను అభిమానించే అమితాబ్ బచ్చన్, సూర్య వంటి హీరోలతో సినిమాలు చేసిన రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘365 డేస్’ చేయడం ఓ గొప్ప అనుభూతి. అయితే, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘శ్రీమంతుడు’లోని కీలక పాత్రలు, ‘కుందనపు బొమ్మ’లో హీరో పాత్రను వదులుకోవడం బాధ అనిపించింది. ఇక నుంచి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదనుకుంటున్నా’’ అని చెప్పారు. తెలుగు, హిందీ భాషల్లో నవనీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నెగటివ్ టచ్ ఉన్న హీరో క్యారెక్టర్ చేస్తున్నాననీ, ఓ తెలుగు చిత్రంలో విలన్‌గా లేడీ డెరైక్టర్ శరణ్య దర్శకత్వం వహిస్తున్న కన్నడ చిత్రం ‘మధువన’లో హీరోగా నటిస్తున్నాననీ నందు తెలిపారు.