
ఆ మధ్య బీబీ అంటూ పోస్టులూ పెడుతూ నటుడు నందు రచ్చ రచ్చ చేశాడు. దీంతో అతడు బిగ్‌బాస్‌లో అడుగు పెట్టబోతున్నాడని అంతా అనుకున్నారు. కానీ అందరి ఊహాగానాలను చిన్నాభిన్నం చేస్తూ బీబీ అంటే "బొమ్మ బ్లాక్‌బస్టర్" అని తన తర్వాతి సినిమా టైటిల్‌ను వెల్లడించాడు. దీంతో అతడు బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడనుకున్న అభిమానులు నిరుత్సాహపడ్డారు. కానీ నిన్న బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో నందు వినిపించాడు. (చదవండి: బిగ్‌బాస్: సూర్యకిరణ్ అవుట్, ఆమెపై బిగ్‌బాంబ్!)
అతడు రాకపోయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ ఏవీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అవినాష్ లైఫ్ జర్నీకి సంబంధించిన ఈ ప్రోమోలో అతడు బాల్యం నుంచి యవ్వనం వరకు పడ్డ కష్టనష్టాలను గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని నందు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశాడు. "నేను చాలా ఇష్టపడే డైరెక్టర్, నా స్నేహితుడు అవినాష్ కోసం వాయిస్ ఓవర్ చెప్పాను. బీబీ, బీబీ అని చెప్పినందుకు చివరికి ఇలానైనా నా వాయిస్ బిగ్‌బాస్‌లో వినపడినందుకు సంతోషం" అని తెలిపాడు. కాగా అవినాష్ ఇంట్లోకి వచ్చిన తొలిరోజే అందరితో కలిసిపోయాడు. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌ను ఇంటి సభ్యులు కూడా బాగానే ఆడకున్నారు. మరి నేడు కామెడీ స్కిట్లో అవినాష్ గెలుస్తాడో లేదో చూడాలి! (చదవండి: గంగవ్వకు మరోసారి కరోనా పరీక్ష)
Comments
Please login to add a commentAdd a comment