
‘‘మంచి కథతో తీసిన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తోంది. నందు, రష్మీ బాగా నటించారు. ఈ సినిమా టైటిల్‌లాగానే బ్లాక్ బస్టర్ కావాలి’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నందు విజయ్‌కృష్ణ, రష్మి గౌతమ్ జంటగా రాజ్ విరాట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలకానుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి హీరో నాగశౌర్య, డైరెక్టర్ విమల్ కృష్ణ, నిర్మాత ‘సెవెన్ హిల్స్’ సతీష్ అతిథులుగా హాజరయ్యారు. నందు విజయ్‌కృష్ణ మాట్లాడుతూ– ‘‘నాపై నమ్మకంతో ఈ చిత్రకథ వినకుండా నటించారు రష్మి. ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు నిర్మాతలు. ‘‘నాది, నందూది 14 ఏళ్ల జర్నీ. రాజ్ విరాట్ కథను నందు నమ్మితే, నేను నందును నమ్మి ఈ సినిమా చేశా’’ అన్నారు రష్మి. ‘‘మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రాజ్ విరాట్. చదవండి: కెరీర్‌లో మొదటిసారి అలాంటి పాత్ర చేశాను : సంతోష్ శోభన్
Comments
Please login to add a commentAdd a comment