ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తగం లేదని, సినిమా ప్రమోషన్స్‌కి రావట్లేదంటూ యాంకర్ రష్మీగౌతమ్‌పై హీరో నందు ఫైర్ అయ్యాడు. అంతేకాదు యాంకర్ రష్మీ షూటింగ్ చేస్తున్న స్థలానికి వెళ్లి నానా హంగామా చేశాడు. రష్మీ కూడా నందుపై ఫైర్ అయింది. ‘నేను రాను.. నాకు ఈ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదు’అని మొహం మీదే చెప్పేసింది. ఇదంతా చదివి నిజంగానే రష్మీ, గౌతమ్ గొడవ పడ్డారని అనుకోకండి. ఓ సినిమా ప్రమోషన్స్ కోసం వీరిద్దరు ఈ ఫ్రాంక్ వీడియో చేశారు.
వివరాల్లోకి వెళితే.. నందు, రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్ విరాఠ్ దర్శకత్వం వహించారు. గత రెండేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఆ సినిమా ఉందనే విషయాన్ని కూడా ప్రేక్షకులు మరచిపోయారు.
(చదవండి: కులం పేరుతో దూషించారు.. ప్రాణహాని ఉంది: నిర్మాత ఫిర్యాదు)
ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత.. ఆ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. నవంబర్ 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని ప్రేక్షకుల్లోకి త్వరగా తీసుకెళ్లేందుకు ఈ ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేశారు మేకర్స్. సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ సమయంలో కూడా నందు ఇలానే చేశాడు. బీబీ అంటూ బిగ్ బాస్ అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో బిగ్‌బాస్‌లోకి వెళ్తాడని అంతా భావించారు. కానీ చివరకు తన కొత్త సినిమా టైటిల్ ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ అని సెలవించాడు.
Comments
Please login to add a commentAdd a comment