Bomma Blockbuster Pre Release Event Highlights And Actors Comments Goes Viral - Sakshi
Sakshi News home page

Bomma Blockbuster: నందు కోసం రష్మీ ఆటోలో తిరిగింది.. మూవీ హిట్‌ కొట్టాలి

Published Thu, Nov 3 2022 4:14 PM | Last Updated on Thu, Nov 3 2022 5:50 PM

Bomma Blockbuster Pre Release Event Highlights - Sakshi

నందు, యాంకర్‌ రష్మీ హీరోహీరోయిన్లు నటించిన తాజా చిత్రం బొమ్మ బ్లాక్‌బస్టర్‌. రాజ్‌ విరాట్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీకి ప్రశాంత్‌ విహారి సంగీతం అందించాడు. ఈ సినిమా వచ్చే నెల 4న విడుదలవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో  ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా వచ్చిన నాగశౌర్య మాట్లాడుతూ.. మంచి కథతో తీసిన ఈ సినిమా ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తుంది. హీరో, హీరోయిన్ లిద్దరూ చాలా బాగా నటించారు . రష్మీ  గురించి తెలియని వారంటూ  ఎవరూ ఉండరు. అలాంటి మంచి పేరున్న తను హీరో నందుకు సపోర్ట్ చేయడానికి ఈ సినిమాకు డబ్బులు తీసుకోకుండా ఆటోలో తిరిగింది అని విన్నాను. తనకు  సినిమా పై  ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. నందు ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డాడు. మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన ఈ సినిమా టైటిల్ మాదిరే  బిగ్ బ్లాక్ బస్టర్  అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు.

సుడిగాలి సుధీర్  మాట్లాడుతూ.. రష్మీ ని చూసి  ఇస్పైర్‌ అయిన చాలా మందిలో నేను ఒకణ్ణి, ఆలా అందరూ బాగుండాలని కొరుకొనే తనకు, నందుకు, దర్శక, నిర్మాతలకు చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్  అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు.

చిత్ర హీరో నందు మాట్లాడుతూ.. నన్ను నమ్మి కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చింది రష్మీ .తనకు  ఈ సినిమా షూట్ చేస్తున్న టైమ్ లో తనకు మేము సరైన  సదుపాయాలు కల్పించలేక పోయినా తను  మాకు ఫుల్ సపోర్ట్ చేసింది. తనకు ఒక్క థ్యాంక్స్ చెపితే సరిపోదు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసిన మా సినిమా కచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుందని భావిస్తున్నాం’అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement