మే22న విడుదలవుతున్న ‘365 డేస్’ | 365 days movie release date in may 22 | Sakshi
Sakshi News home page

మే22న విడుదలవుతున్న ‘365 డేస్’

Published Mon, May 11 2015 5:11 PM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

మే22న విడుదలవుతున్న ‘365 డేస్’

మే22న విడుదలవుతున్న ‘365 డేస్’

నందు, అనైక సోఠి హీరో హీరోయిన్లుగా డీవీ క్రియేషన్స్ బ్యానర్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ దర్శకత్వంలో డి.వెంకటేష్ నిర్మించిన చిత్రం ‘365 డేస్’. పెళ్లైన ప్రేమికులకు తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయనే కాన్సెప్ట్ పై ఈ చిత్రం రూపొందింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న  ఈచిత్రం క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను పొందింది. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ ‘’ప్రేమించుకుని ఒకటైన ఒక జంట పెళ్లి తరవాత ఎలాంటి పరిణామాలు చూశారు. పెళ్లికి ముందు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డవారికి పెళ్లి తర్వాత ఒకరంటే ఒకరకి పడకుండా పోవడానికి కారణాలేంటి అనే పాయింట్ మీద మా ‘365డేస్’ చిత్రం ఉంటుంది. ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మగారు చేయని జోనర్ మూవీ ఇది. ఇటీవల విడుదలైన ఆడియో మంచి రెస్పాన్ ను సంపాదించుకుంది. ట్రైలర్, ఫస్ట్ లుక్, పోస్టర్ ఇలా అన్నింటికి ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను పొందింది, ఈ చిత్రాన్ని ఈ నెల22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement