నందుతో గీతామాధురి నిశ్చితార్థం | Geetha Madhuri gets engaged with Nandu | Sakshi
Sakshi News home page

నందుతో గీతామాధురి నిశ్చితార్థం

Published Tue, Nov 12 2013 12:16 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

నందుతో గీతామాధురి నిశ్చితార్థం - Sakshi

నందుతో గీతామాధురి నిశ్చితార్థం

గాయని గీతామాధురి, నటుడు నందు వివాహ నిశ్చితార్థం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. చాలా కొద్దిమంది బంధుమిత్రులను ఈ వేడుకకు ఆహ్వానించారు. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. గీతామాధురి ఇటీవల కాలంలో ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించారు.

‘ఫొటో’ సినిమాతో హీరోగా పరిచయమైన నందు ‘100% లవ్’లో కీలకపాత్ర పోషించారు. ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు. ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement