స్టేషన్ మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: చల్లటి వాతావరణంలో శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం అటు సినీగాయకుల హుషారైన పాటలు, ఇటు ప్రేక్షకుల చపట్లతో మారుమోగింది. ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు గీతామాధురి, హేమచంద్ర తమ పాటలతో అలరించారు. గీతామాధురి పాడిన ‘ఓసినా డార్లింగే’, ‘మగాళ్లు ఒట్టి మాయగాళ్లు’, ‘కెవ్వుకేక’ పాటలతో హుషారెత్తించారు. అదేవిధంగా హేమచంద్ర పాడిన ‘ైవె దిస్ కొలవెరి’, ‘దమ్ములాంటి కన్నులు ఉన్న’, ‘సక్కుబాయి’ తదితర పాటలు ఆకట్టుకున్నాయి. ఇద్దరు గాయకులు పాటలు పాడుతూ మధ్యలో డాన్స్‌చేస్తూ హోరెత్తించారు. కార్యక్రమానికి నిర్వహకులు తగిన ఏర్పాట్లుచేశారు. మైదానం జనంతో నిండిపోయింది. పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.
పాలమూరులో గీతా గాన మాధుర్యం
Published Sun, Dec 8 2013 4:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement