మెట్రోలో గీత మెలోడీ! | geetha maduri melodi song in metro movie | Sakshi
Sakshi News home page

మెట్రోలో గీత మెలోడీ!

Published Sat, Nov 26 2016 12:41 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

మెట్రోలో గీత మెలోడీ! - Sakshi

మెట్రోలో గీత మెలోడీ!

‘నిన్నే నిన్నే కోరా...’ (‘నచ్చావులే’ చిత్రం) అంటూ మెలోడీ సాంగ్ మాత్రమే కాదు.. ‘డార్లింగే ఓసి నా డార్లింగే...’ (ప్రభాస్ ‘మిర్చి’) అంటూ మాస్ సాంగ్‌ని కూడా అద్భుతంగా పాడగల నైపుణ్యం గాయని గీతామాధురిది. తెలుగులో దూసుకెళుతున్న టాప్ సింగ ర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గీత గతంలో వెంకటేశ్ ‘షాడో’ చిత్రంలో ‘ఐయామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్’ సాంగ్ మేకింగ్ వీడియోలో కనిపించారు. ఈ క్రేజీ సింగర్ తాజాగా ‘మెట్రో’ చిత్రంలో ఓ మెలోడి సాంగ్ పాడటంతో పాటు ఆ పాటలో నటిం చారు.

ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘మెట్రో’ మూవీని సురేశ్ కొండేటి సమర్పణలో రజని తాళ్లూరి అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘గీతా మాధురి పాడిన పాట హైలైట్. డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. త్వరలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని సురేశ్ కొండేటి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement