Hema Chandra
-
కుమారీ ఆంటీ ఒకప్పుడు ఆ సింగర్ ఇంట్లో పని చేసింది!
కుమారి ఆంటీ.. సోషల్ మీడియాలో ఇప్పుడీవిడే ట్రెండింగ్. నాన్నా, బుజ్జి, కన్నా అంటూ ప్రేమగా భోజనం వడ్డిస్తుందీ ఆంటీ. అందుకే ఆమె ఫుడ్ స్టాల్‌కు అంత గిరాకీ! దీంతో యూట్యూబర్లు ఎగబడ్డారు, వీడియోలు తీశారు. ఆమెను మరింత ఫేమస్ చేశారు. దీంతో ఎక్కడెక్కడినుంచో జనాలు ఆమె చేతివంట తినేందుకు క్యూ కడుతున్నారు. అటు సోషల్ మీడియాలోనూ ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి. సింగర్ ఇంట్లో పని చేసిన కుమారి ఆంటీ అయితే ఇలా చిన్నపాటి హోటల్ పెట్టడానికి ముందు టాలీవుడ్ సింగర్ హేమచంద్ర ఇంట్లో పని చేసిందట! ఈ విషయాన్ని కుమారీ ఆంటీ స్వయంగా వెల్లడించింది. '2009లో హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడు దుస్తులు కుట్టేదాన్ని. అలాగే గాయకుడు హేమచంద్ర ఇంట్లో వంటలు చేయడానికి వెళ్లేదాన్ని. ఇలా చాలా పనులు చేశాను. హేమచంద్ర తల్లి చాలా బాగా చూసుకునేది. అమాయకురాలిగా ఉన్నావు, ఇలాగైతే ఎలా బతుకుతావు? అనేవారు. మా అమ్మానాన్నలాగా ప్రేమగా చూసుకునేవారు. మాకు ఏదైనా తెలియకపోతే వాళ్లే ఇలా చేయాలి, అలా చేయాలని సలహాలు ఇచ్చేవారు. చాలా మంచివారు. సందీప్ కిషన్ ఎంతిచ్చాడంటే? ఇకపోతే 2011లో రోడ్డు పక్కన భోజనం అమ్మడం ప్రారంభించాం. మొదటి నుంచీ సీరియల్, సినిమా సెలబ్రిటీలు నా దగ్గర ఫుడ్ తీసుకెళ్లేవాళ్లు. జూనియర్ ఎన్టీఆర్, అలీ.. కూరలు పట్టుకువెళ్లేవాళ్లు. ఈ మధ్య సందీప్ కిషన్ వచ్చి నా చేతి వంట రుచి చూశాడు. తిన్న తర్వాత రూ.10 వేలు నా చేతిలో పెట్టాడు' అని చెప్పుకొచ్చింది కుమారి ఆంటీ. బిగ్‌బాస్ ఆఫర్ గురించి మాట్లాడుతూ అక్కడ వంటలు చేస్తారా? ఒకవేళ నన్ను రమ్మంటే వెళ్లి వంటలు చేయాలా? అని అమాయకంగా అడిగింది. అసలు తాను బిగ్‌బాస్ షో చూడనని, అలాంటి ఆఫర్ ఏదీ రాలేదని పరోక్షంగా బదులిచ్చింది. చదవండి: ఫ్రీగా వెడ్డింగ్ డ్రెస్సులు కావాలా? నువ్వో పెద్ద సెలబ్రిటీ మరి! నటిపై ఫైర్ -
Telugu Indian Idol 2: నిత్యా ప్లేస్‌లో గీతా.. హోస్ట్ కూడా మారాడు!
ప్రముఖ ఓటీటీ ఆహాలో సూపర్ హిట్ అయిన షోలలో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. . యంగ్ సింగర్స్‌కు తమ ట్యాలెంట్ నిరూపించుకోవడానికి ఈ సింగింగ్ షో మంచి వేదికగా నిలిచింది.ఈ షోకి సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్.. సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించి సందడి చేశారు. అంతేకాదు గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చి అలరించారు. త్వరలోనే ఈ సింగింగ్ షో రెండో సీజన్ రాబోతుంది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కర్టెన్ రైజర్ ప్రోగ్రాం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఈవో అజిత్ ఠాకూర్, ప్రముఖ సింగర్లు, ఎస్.ఎస్. తమన్, కార్తీక్, గీతామాధురి, హేమచంద్ర తదితరలు హాజరయ్యారు. ఇక సీజన్ 1కి శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. రెండో సీజన్‌ని హేమచంద్ర హోస్ట్ చేయనున్నారు. ఇక జడ్జీల విషయానికొస్తే… సింగర్ నిత్యామీనన్ ప్లేస్‌లో ట్యాలెంటెడ్ సింగర్ గీతా మాధురి రానుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
విడాకుల వార్తలపై స్పందించిన హేమచంద్ర దంపతులు!
టాలీవుడ్ స్టార్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకుల వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాను ఊపేస్తున్న విషయం తెలిసిందే! కొన్నినెలల నుంచి వీరికి మాటల్లేవని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై హేమచంద్ర దంపతులు స్పందించారు. నా పాటల కంటే కూడా అనవసరమైన రూమర్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి అని జనాలు కూడా వాటిని పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకుంటున్నారంటూ హేమచంద్ర సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. అటు శ్రావణ భార్గవి సైతం స్పందిస్తూ.. 'కొన్ని రోజులుగా నా యూట్యూబ్ ఛానల్లోని వీడియోలకు వ్యూస్ పెరుగుతున్నాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కూడా పెరిగారు. నాకు పని పెరిగింది, దానితో పాటు ఆదాయం కూడా పెరిగింది. తప్పో ఒప్పో మీడియా వల్లే ఇదంతా జరిగింది' అని రాసుకొచ్చింది. మొత్తానికి విడాకులనేవి వట్టి పుకారు మాత్రేమనని సింగర్స్ కుండ బద్ధలు కొట్టారని కొందరు నెటిజన్లు అంటుంటే, ఇప్పటికీ సరిగా క్లారిటీ ఇచ్చినట్లు కనిపించడం లేదని మరికొందరు అంటున్నారు. కాగా శ్రావణ భార్గవి, హేమచంద్ర ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. 2013లో వివాహ బంధంతో ఒక్కటైన వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. View this post on Instagram A post shared by ravuri sravana bhargavi (@ravurisravana.bhargavi) View this post on Instagram A post shared by Vedala Hemachandra (@vedalahemachandra) చదవండి: మీనా భర్త హఠాన్మరణం పట్ల సెలబ్రిటీల సంతాపం.. ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది: డైరెక్టర్ -
ఏద్దాం గాలం, సేసేద్దాం గందరగోళం.. ముగ్గురు సింగర్లు పాడిన ఈ పాట విన్నారా?
తాప్సీ ముఖ్య తారగా స్వరూప్ ఆర్ఎస్జె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘ఏద్దాం గాలం.. సేసేద్దాం గందరగోళం.. లేసేలోగా ఏసేద్దాం రా ఊరిని వేలం..’ అంటూ సాగే మొదటి పాటను బుధవారం విడుదల చేశారు. మార్క్ కె. రాబిన్ స్వరపరచిన ఈ పాటకు దర్శకుడు హసిత్ గోలీ సాహిత్యం అందించగా శ్రీరామ్ చంద్ర, రాహుల్ సిప్లిగంజ్, హేమచంద్ర పాడారు. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రానికి కెమెరా: దీపక్ యెరగరా, అసోసియేట్ ప్రొడ్యూసర్: ఎన్ ఎం పాషా. -
వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మినిమమ్ టైం స్కేల్ (ఎంటీఎస్) అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరంలేదని, దీనిపై మంత్రుల బృందం చర్చిస్తోందని తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం ఆయనతోపాటు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్‌చంద్ర మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం 2019 ఎన్నికల వేళ ఇచ్చిన జీఓ–24లోని అంశాల్లో నెలకొన్న గందరగోళంతోనే వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ అమలులో జాప్యం జరుగుతోందని హేమచంద్రారెడ్డి వివరించారు. కాంట్రాక్టు అధ్యాపకులను మభ్యపెట్టేందుకే ఆ సర్కారు జీఓ 24ను ఇచ్చిందన్నారు. అంతేకాక.. ‘గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కాంట్రాక్టు అధ్యాపకుల గురించి అస్సలు పట్టించుకోలేదు. 2015 సవరించిన పే స్కేల్స్ ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ ఇవ్వాలని జీఓలో పేర్కొనడంవల్లే వారికి దాని అమలులో ఆటంకం ఏర్పడింది. వర్సిటీ అధ్యాపకులకు రాష్ట్ర రివైజ్డ్ పే స్కేళ్లు వర్తించవు. వారికి యూజీసీ రివైజ్డ్ పే స్కేళ్లు వర్తిస్తాయి. అయినా.. నాటి ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా జీఓ ఇచ్చింది’.. అని హేమచంద్రారెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో.. కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ ఎలా వర్తింపజేయాలనే దానిపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం జీఓ–40 తీసుకొచ్చిందన్నారు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఎంటీఎస్ సక్రమంగా అమలుచేస్తున్నప్పటికీ యూనివర్సిటీ స్థాయిలో అమలుచేయడం లేదంటూ వస్తున్న వార్తలలో వాస్తవంలేదని ఆయన కొట్టిపారేశారు. గతంలో యూనివర్సిటీల్లో జరిగిన నియామకాల్లో ఒక క్రమపద్ధతి పాటించకపోవడంవల్లే ఇప్పుడు సమస్యలు తలెత్తున్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఆర్థికశాఖ అనుమతిలేకుండా నియామకాలు చేశారని.. కనీసం నోటిఫికేషన్ ఇవ్వడం, రిజర్వేషన్లను, రోస్టర్ పాయింట్లను పాటించడం వంటి నిబంధనలు పట్టించుకోలేదన్నారు. ఇక రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల్లో ప్రస్తుతం 2,100 కాంట్రాక్టు అధ్యాపకులు ప్రస్తుతం పనిచేస్తున్నారని.. వీరిలో నిబంధనల ప్రకారం నియమితులైన వారెంతమంది? నోటిఫికేషన్ లేకుండా నియమితులైన వారెంతమంది అన్నదానిపై వర్సిటీల్లో స్పష్టతలేకపోవడం ఎంటీఎస్ అమలుకు ఆటంకంగా ఉందన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని, వర్సిటీల్లో అలా జరగకపోవడంవల్ల ఇబ్బంది అవుతోందని హేమచంద్రారెడ్డి వివరించారు. ‘అయినప్పటికీ కొన్ని వర్సిటీల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదికవి నన్నయ్య, జేఎన్టీయూ (కాకినాడ), జేఎన్టీయూ (అనంతపురం), శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు ఇప్పటికే 40వేల వరకూ వేతనాలు పెంచాం. అన్నిచోట్ల ఒకే విధంగా వేతనం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. కేసులతోనే ఎంటీఎస్ అమలులో సమస్యలు ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మాట్లాడుతూ.. కనీస టైం స్కేల్ అమలు విషయంలో కొన్ని వర్సిటీల్లోని కొంతమంది ఉద్యోగులు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోందన్నారు. ఇటీవల ఎయిడెడ్ కాలేజీల్లోని ఎయిడెడ్ సిబ్బందిని వర్సిటీల్లో నియమించడం ద్వారా వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను తొలగిస్తారంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఏ ఒక్క కాంటాక్టు అధ్యాపకుడినీ, ఉద్యోగినీ ప్రభుత్వం తొలగించబోదని ఆయన స్పష్టంచేశారు. ఎయిడెడ్ అధ్యాపకులు 700–800 మంది ఉన్నారని, వారిలో 300 మంది మాత్రమే యూనివర్సిటీలకు అర్హత కలిగి ఉన్నారని తెలిపారు. వారిని నియమించినా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించబోమన్నారు. వచ్చే ఏడాది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం ఇక ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ప్రకారం.. వచ్చే ఏడాది ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వం 2000 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేయనుందని సతీష్‌చంద్ర వెల్లడించారు. వర్సిటీ కాంట్రాకు అధ్యాపకులకు ఇది మంచి అవకాశమన్నారు. ఏపీపీఎస్సీ రాతపరీక్ష ద్వారా ఈ నియామకాలు జరుగుతాయని చెప్పారు. నిజానికి.. కాంట్రాక్టు అధ్యాపకులను, ఉద్యోగులను రెగ్యులర్ చేసే అధికారం రాష్ట్రాలకులేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పులిచ్చిందని ఆయన చెప్పారు. అంతేకాక.. 1994లో తెచ్చిన చట్టం ప్రకారం కూడా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే అవకాశంలేదన్నారు. గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరిగేది కాదని.. ప్రస్తుత ప్రభుత్వం వారికి అనేక రకాలుగా మేలు చేస్తోందని సతీష్‌చంద్ర వివరించారు. అప్పట్లో ఏజెన్సీల ద్వారా జరిగే నియామకాల్లో అవినీతి జరిగేదని, జీతాలు కూడా కోతపెట్టేవారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అవుట్ సోర్సింగ్‌కు కార్పొరేషన్‌ను (ఆప్కాస్) ఏర్పాటుచేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన వేతనాలను సమయానికి ఇస్తోందన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యత ప్రభుత్వానిదేనని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సతీష్‌చంద్ర భరోసా ఇచ్చారు. -
‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు
వెంకటేష్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా క్షణ క్షణం. 1990లో రిలీజ్ అయిన ఈసినిమాలో జాము రాతిరి జాబిలమ్మ పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా, ఆ పాట విడుదలై 29 ఏళ్లు పూర్తి చేసుకొని 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులకు జామురాతిరి జాబిలమ్మ పాటను సరికొత్తగా అందించారు కీరవాణి టీం. కీరవాణి టీంలో ఉన్న యువతరం గాయనీ గాయకులు ఈ పాటను సరికొత్తగా ఆలపించి రిలీజ్ చేశారు. అంతేకాదు కాలిఫోర్నియాలోని సాన్జోస్లో చిత్రీకరించిన విజువల్స్‌తో వేల్ రికార్డ్స్ ద్వారా పాటను రీమిక్స్ చేసి విడుదల చేశారు. అప్పట్లో బాలు, చిత్రలు ఈ పాటను ఆలపించగా రీమిక్స్ వర్షన్లో హేమ చంద్ర, కాలభైరవ, మనీష, దీపు, దామిని, మౌనిమ, శృతి, నోయల్ సీన్, పృథ్వీ చంద్రలు ఆలపించారు. -
ధృవలో అరవింద్ స్వామికి డబ్బింగ్ ఎవరు..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్‌గా కనిపించనున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఎంతో మందిని సంప్రదించిన తరువాత ఒరిజినల్ వర్షన్లో నటించిన అరవింద్ స్వామినే ఆ పాత్రకు తీసుకున్నారు. అయితే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్‌కు తెలుగులో డబ్బింగ్ ఎవరు చెపుతున్నారు. అన్న చర్య జరుగుతోంది. తమిళ నటుడైన అరవింద్ స్వామి తెలుగులో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోలేడు. అందుకే తెలుగులో ఈ పాత్రకు ఓ యువ గాయకుడితో డబ్బింగ్ చెప్పించారట. గతంలో స్నేహితుడు సినిమాలో విజయ్‌కి డబ్బింగ్ చెప్పిన గాయకుడు హేమచంద్ర, ధృవ సినిమాలో అరవింద్ స్వామికి డబ్బింగ్ చెపుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో హేమచంద్ర వాయిస్‌కు మంచి మార్కులే పడ్డాయి.