Singers Hema Chandra And Sravana Bhargavi Reaction On Divorce Rumours, Posts Viral - Sakshi
Sakshi News home page

Hema Chandra- Sravana Bhargavi: విడాకుల వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి ఏమన్నారంటే?

Published Wed, Jun 29 2022 3:06 PM | Last Updated on Wed, Jun 29 2022 3:37 PM

Singers HemaChandra And Sravana Bhargavi Reaction On Divorce Rumours, Posts Viral - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్స్‌ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకుల వార్త గత కొంతకాలంగా సోషల్‌ మీడియాను ఊపేస్తున్న విషయం తెలిసిందే! కొన్నినెలల నుంచి వీరికి మాటల్లేవని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై హేమచంద్ర దంపతులు స్పందించారు.

నా పాటల కంటే కూడా అనవసరమైన రూమర్లు ఎక్కువగా స్ప్రెడ్‌ అవుతున్నాయి అని జనాలు కూడా వాటిని పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకుంటున్నారంటూ హేమచంద్ర సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు. అటు శ్రావణ భార్గవి సైతం స్పందిస్తూ.. 'కొన్ని రోజులుగా నా యూట్యూబ్‌ ఛానల్‌లోని వీడియోలకు వ్యూస్‌ పెరుగుతున్నాయి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు కూడా పెరిగారు. నాకు పని పెరిగింది, దానితో పాటు ఆదాయం కూడా పెరిగింది. తప్పో ఒప్పో మీడియా వల్లే ఇదంతా జరిగింది' అని రాసుకొచ్చింది.

మొత్తానికి విడాకులనేవి వట్టి పుకారు మాత్రేమనని సింగర్స్‌ కుండ బద్ధలు కొట్టారని కొందరు నెటిజన్లు అంటుంటే, ఇప్పటికీ సరిగా క్లారిటీ ఇచ్చినట్లు కనిపించడం లేదని మరికొందరు అంటున్నారు. కాగా శ్రావణ భార్గవి, హేమచంద్ర ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. 2013లో వివాహ బంధంతో ఒక్కటైన వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది.

చదవండి:  మీనా భర్త హఠాన్మరణం పట్ల సెలబ్రిటీల సంతాపం..
ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది: డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement