Shravana Bhargavi
-
విడాకుల వార్తలపై స్పందించిన హేమచంద్ర దంపతులు!
టాలీవుడ్ స్టార్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకుల వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాను ఊపేస్తున్న విషయం తెలిసిందే! కొన్నినెలల నుంచి వీరికి మాటల్లేవని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై హేమచంద్ర దంపతులు స్పందించారు. నా పాటల కంటే కూడా అనవసరమైన రూమర్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి అని జనాలు కూడా వాటిని పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకుంటున్నారంటూ హేమచంద్ర సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. అటు శ్రావణ భార్గవి సైతం స్పందిస్తూ.. 'కొన్ని రోజులుగా నా యూట్యూబ్ ఛానల్లోని వీడియోలకు వ్యూస్ పెరుగుతున్నాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కూడా పెరిగారు. నాకు పని పెరిగింది, దానితో పాటు ఆదాయం కూడా పెరిగింది. తప్పో ఒప్పో మీడియా వల్లే ఇదంతా జరిగింది' అని రాసుకొచ్చింది. మొత్తానికి విడాకులనేవి వట్టి పుకారు మాత్రేమనని సింగర్స్ కుండ బద్ధలు కొట్టారని కొందరు నెటిజన్లు అంటుంటే, ఇప్పటికీ సరిగా క్లారిటీ ఇచ్చినట్లు కనిపించడం లేదని మరికొందరు అంటున్నారు. కాగా శ్రావణ భార్గవి, హేమచంద్ర ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. 2013లో వివాహ బంధంతో ఒక్కటైన వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. View this post on Instagram A post shared by ravuri sravana bhargavi (@ravurisravana.bhargavi) View this post on Instagram A post shared by Vedala Hemachandra (@vedalahemachandra) చదవండి: మీనా భర్త హఠాన్మరణం పట్ల సెలబ్రిటీల సంతాపం.. ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది: డైరెక్టర్ -
చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట?
Hemachandra Sravana Bhargavi Divorce News Viral In Social Media: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల మాట ఎలా ఉన్నా విడాకుల వార్తలు మాత్రం హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. సినీ సెలబ్రిటీలు తమ భాగస్వామికి డివోర్స్‌తో వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ మరో కొత్త దాంపత్య జీవితానికి తెర లేపుతున్నారు. కొందరైతే ఎంతో మధురంగా రాసుకున్న తమ పెళ్లి పుస్తకాన్ని చింపేసి సోలో లైఫే సో బెటర్ అంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్లో క్యూట్ పేయిర్ అయిన నాగ చైతన్య, సమంత విడాకులతో తెగదెంపులు చేసుకున్న విషయం ఇప్పటికీ అనేకమందికి మింగుడుపడటం లేదు. తాజాగా మరో జంట డివోర్స్ తీసుకునేందుకు రెడీ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త గింగిరాలు తిరుగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో గాయనీ గాయకులుగా శ్రావణ బార్గవి, హేమచంద్ర చాలా ఫేమస్ అయ్యారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా హేమచంద్ర చాలా పాపులర్. శ్రావణ భార్గవి, హేమచంద్ర ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి పీటలు ఎక్కారు. 2013లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు ప్రేమకు గుర్తుగా 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. ఎంతో హాయిగా సాగుతున్న వీరి జీవితంలో ఏం జరిగిందో తెలియదు గానీ, వీరు తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు గత కొద్దిరోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. (చదవండి: 'నువ్వే కావాలి' హీరోకు నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు) (చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..) ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు రచ్చ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే హేమచంద్ర ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈ డివోర్స్ వార్తలు నిజమే అన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఏకంగా హేమచంద్ర, శ్రావణ భార్గవి సోషల్ మీడియా అకౌంట్స్‌లోని వారి పోస్టులకు కామెంట్స్ రూపంలో ప్రశ్నిస్తున్నారు. ఇటు హేమచంద్ర, అటు శ్రావణ భార్గవి తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్‌లలో స్టోరీస్, పోస్టులు పెడుతున్నారే తప్ప ఈ కామెంట్లకు స్పందించకపోవడం గమనార్హం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని తెలుస్తోంది. (చదవండి: నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) -
ఈ టైటిల్ భావమేమిటో!
టైటిల్‌ని బట్టి ఆ కార్యక్రమం థీమ్ ఏమిటో అంచనా వేస్తుంటాం. అందుకు అనువుగా ఉండేట్టే ఏ ప్రోగ్రాముకైనా పేరు నిర్ణయిస్తారు. కానీ జెమినీ చానెల్లో ప్రసారమయ్యే ఓ ప్రోగ్రామ్ పేరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. అదే... బోల్ బేబీ బోల్. ‘బోల్ బేబీ బోల్’ అనేది పాటల పోటీ. చిన్నపిల్లల్లో దాగివున్న సింగింగ్ టాలెంట్‌ను వెలికితీసి, వారిని ప్రోత్సహించే కార్యక్రమం ఇది. కోటి, కల్పన, సుమంగళి లాంటి ప్రముఖులు న్యాయ నిర్ణేతలు. హేమచంద్ర, శ్రావణ భార్గవి యాంకర్లు. కార్యక్రమం అయితే చాన్నాళ్లుగా విజయవంతంగా సాగిపోతోంది. కానీ ఇంత కాలమైనా ఇప్పటికీ ఆ షోకి ఆ పేరు ఎందుకు పెట్టారో మాత్రం చాలామందికి అర్థం కావడం లేదు. కనీసం ‘సింగ్ బేబీ సింగ్’ అని పెట్టినా ఓ అర్థముండేదేమో. కానీ పాటల కార్యక్రమానికి ‘బోల్ బేబీ బోల్’ అని పెట్టడంలో భావం మాత్రం